విజయం మీదే: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంత సులభమా...?

VAMSI
గవర్నమెంట్ జాబ్ అనేది చదువుకునే ప్రతి విద్యార్థి యొక్క కల. తమ తమ విద్యార్హత కు సరిపోయే గవర్నమెంట్ జాబ్ లభించాలి అంటూ ఆకాంక్షిస్తారు విద్యార్థులు. కొందరు సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ రావాలని కోరుకుంటే మరికొంత మంది విద్యార్థులు స్టేట్ గవర్నమెంట్ లో రావాలని కోరుకుంటారు. ఎంతోమంది విద్యార్థులు ఏళ్లతరబడి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తుంటారు. కానీ ఇది అనుకున్నంత సులభం కాదని అందరికీ తెలిసిందే. కృషి పట్టుదల.. ఎంతో కొంత అదృష్టం ఉంటే తప్పితే అంత ఈజీగా గవర్నమెంట్ జాబ్ వరించదు.

గవర్నమెంట్ జాబ్ కనుక ఉంటే జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుంది.. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులకు దూరంగా ఉండొచ్చు. సమాజంలో మనకంటూ ఓ గౌరవం లభిస్తుంది. అంత ముఖ్యమైన గవర్నమెంట్ జాబు పొందడానికి విద్యార్హత తో పాటు ఉండాల్సిన లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గవర్నమెంట్ జాబ్ పొందాలనుకునేవారు... కేవలం ఫలానా జాబ్ అని మాత్రమే ఫిక్స్ అయితే సరి కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే కేవలం ఆ జాబ్ నోటిఫికేషన్ కోసమే ఎదురు చూడడం, ఆ జాబ్ కు సంబంధించిన సిలబస్ పరిధిలో మాత్రమే చదువుకోవడం, ఇటువంటివి మనల్ని వాటి వరకు మాత్రమే పరిమితం చేస్తాయి.... ఆ జాబ్ కోసమే ఎదురు చూస్తుంటే కొన్నిసార్లు సమయం వృధా అయిపోయే సమస్య ఉంది.

 కాబట్టి ముందుగా మన విద్యార్హతలను బట్టి గవర్నమెంట్ జాబ్స్ లలో ఉన్న ఉద్యోగాలు ఏవి మనకు దగ్గరగా ఉన్నాయో ఎంచుకోవాలి. ఎలాగో వాటిన్నింటికీ ఇంచుమించుగా ఒకే సిలబస్ ఉంటుంది కాబట్టి చదువుకోవడం ఈజీ గానే ఉంటుంది. కానీ ఎంతో శ్రద్ధ పెట్టి కసిగా చదివితేనే ఉద్యోగాన్ని సంపాదించగలరు. ఎక్కువ పోస్టులకు అప్లై చేయడం వల్ల మనకు టాలెంట్ ఉంటే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం అంత కష్టమేమీ కాదు. కానీ అన్ని జాబ్ లకు ఒకే సిలబస్ ఉండదు... అలాంటప్పుడు చూసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ముందుగా ఎంచుకున్న జాబ్స్ సంబంధించి సిలబస్ ను చూసుకోవాలి.

మనకు ఉన్న సమయాన్ని బట్టి సబ్జెక్ట్స్ ను విభజించుకోవాలి. ప్రీవియస్ పేపర్స్ ను కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. బుక్ స్టోర్స్ చాలా ముఖ్యం. బిట్లను చదవడం కంటే... కాన్సెప్ట్ ను చదవడం మంచిది. వీలైతే కోచింగ్ కి వెళ్లడం లేదా కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయించి శ్రద్ధగా చదవటం వంటివి చేయాలి. రెగ్యులర్ గా న్యూస్ పేపర్లు చదవాలి, జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. అతి ముఖ్యమైన విషయం ఎప్పటికప్పుడు మనం చదివిన సిలబస్ మనం ఎంత వరకు అర్థం చేసుకుని నేర్చుకున్నామో పరీక్షించుకుంటూ ఉండాలి. వీలైతే మనకు మనమే టెస్ట్ పేపర్స్ రెడీ చేసుకోవడం మంచిది. ఇవన్నీ పాటించినట్లయితే మీరు అనుకున్న విధంగా గవర్నమెంట్ జాబ్  పొందడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: