విజయం మీదే: ఆత్మస్థైర్యమే మీ ఆయుధం...!

VAMSI
జీవితంలో మనము పడిన కష్టానికి ప్రతిఫలం, అలాగే చేసిన ప్రయత్నానికి సఫలం, కలలకు సాఫల్యం.. మరి విజయానికి వైఫల్యం ఎందుకు? విజయం కేవలం కొందరి సొత్తేనా? ఎల్ కేజీ పిల్లవాడి నుండి ఎమ్.ఎస్ విద్యార్ధి వరకు, బిల్ కలెక్టరు నుండి బిజినెస్ మ్యాన్ దాకా, ఆటగాడు, వేటగాడు, రాత పరీక్షలు, విజయానికి అర్హతలు ఉంటాయా? లేవు అనుకుంటే విజయం కొందరికి మాత్రమే సొత్తు ఎలా అవుతోంది.
విజయానికి చేరుకోవాల్సిన అనే దానికి ఎటువంటి గూడర్ధాలు లేవు, పెడర్ధాలు లేవు, రహస్యాలు లేవు, రాద్ధాంతాలు లేవు. మీరు హాస్యం అనుకున్నా, పరిహాస్యం అనుకున్నా విజయం మీ చిటికెన వ్రేలు చివరలోనే ఉంది. జారిపోకుండా చేతిలోకి తీసుకునే నైపుణ్యం మీకు ఉందా? అయితే అది మీ సొంతం, మీరు వదిలేసినా అది మిమ్మల్ని వదలదు. వెతుక్కుంటూ మీ చెంతకి చేరుతుంది. విజయం మీ సొత్తు, మీ ఒక్కరి సొత్తు. ఎలా అంటారా, అయితే ఈ కథను చదవండి.
ప్రకాష్ అనే వ్యక్తి తన డిగ్రీ పూర్తవగానే పోటీ పరీక్షలకి ఒక ప్రణాళిక పెట్టుకుని చాలా కష్టపడి ఆరు నెలలు చదివాడు. అనుకున్నట్టుగానే పరీక్ష సమయం వచ్చింది. ఆ ఉద్యోగం అతనికి ఎంతో అవసరం. కానీ వస్తుందో లేదో అన్న భయంతో పాటు ఉద్యోగం ఎలాగైనా సంపాదించాలి అన్న కసితో పరీక్ష హాలులోకి వెళ్ళాడు.  అక్కడ చాలా మంది వ్యక్తులు తనలాగానే ఆందోళనగా కనిపిస్తున్నారు. కొందరు తనకంటే బాగా చదివిన వాళ్ళలాగా ఉన్నారు. ప్రకాష్‌కి ఇంకో సందేహం మొదలయింది. ఇక్కడ నాకంటే బాగా చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను చూస్తే పేజీలకు పేజీలు వస పట్టిన వాళ్ళ లాగా ఉన్నారు. నేను ఉన్న ఈ ఒక్క గదిలోనే ఇంత మంది ఉంటే దేశం మొత్తం మీద ఎంత మంది ఉంటారు? అంత మందిలో కేవలం స్వల్ప పోస్టుల కోసం జరిగే ఈ పరీక్షలో ఒక సాధారణ విద్యార్ధిని అయిన నేను నెగ్గగలనా? అనుకున్నాడు.
వెంటనే ప్రకాష్‌కు ఉన్న ఆర్ధిక సమస్యలు గుర్తొచ్చాయి. ఉద్యోగం తనకి చాలా అవసరం. ఈ ఆరు నెలలు తను ఎంత ప్రణాళిక బద్ధంగా కష్టపడి చదివాడో గుర్తు చేసుకున్నాడు. ఊపిరి గట్టిగా తీసుకుని ప్రశాంతంగా ఆలోచనలు పక్కకు మరల్చాడు. పరీక్ష ప్రారంభమయింది. అందరి లాగానే పరీక్ష రాసి బయటకి వచ్చాడు. ఒక చెట్టు కింద మాట్లాడుకుంటున్న నలుగురి వ్యక్తుల సంభాషణ వింటూ అలా పక్కన నిల్చున్నాడు. అందులో ఒక వ్యక్తి “ప్రశ్నలన్నీ చాలా సులభంగా ఇచ్చారు. దాదాపుగా నేను సెలెక్ట్ అవొచ్చు” అని అన్నాడు. మరో వ్యక్తి “నేను కూడా అన్నిటికి బాగానే రాసాను” అన్నాడు. అంతలో ఇంకో వ్యక్తి మాత్రం “ప్రశ్నలన్నీ చాలా తికమకగా ఇచ్చారు, అన్నిటికీ సమాధానం ఇచ్చామనే అనుకుంటున్నాం.
కానీ తార్కికంగా అవి మనల్ని తప్పుత్రోవ పట్టిస్తున్నాయి. కాబట్టి సెలక్టు అవుతామనే నమ్మకం నాకు లేదు” అన్నాడు. ఈ మాటలన్నీ విన్న ప్రకాష్ తను బాగా రాసాడో లేదో తెలియక తికమక పడుతూ వెళ్ళిపోయాడు. ప్రకాష్ కి ఆ ఉద్యోగం వస్తుందనే నమ్మకం పోయింది. ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడం తన వల్ల కాదు అనుకున్నాడు. కానీ తనకి ఉన్న సమస్యలను ఎలాగైనా దాటాలి. అందుకోసం ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చూసుకున్నాడు. వచ్చే అంతంత మాత్రం జీతంతో ప్రణాళికతో తన సమస్యలను తీర్చుకోవాలని అనుకున్నాడు. కానీ తన అవసరాలు ఆదాయానికి మించి ఉన్నాయి. ఏ విధంగా తాను ఆత్మసాహారియంతో ముందుకు సాగాడు...తద్వారా జీవితంలో తనకున్న సమస్యలకు తలొగ్గలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: