విజయం మీదే: ఆరోగ్యమే మహాభాగ్యము...!

VAMSI
ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగుల జీవితంలో ఎవరూ  తమ ఆరోగ్యం  గురించి సరైన  జాగ్రత్తలు తీసుకోవడం లేదు. సమయానికి  తినే వారి సంఖ్య వేళ్లపై లెక్క పెట్టవచ్చు అలా  మారిపోయింది మనుషుల లైఫ్ స్టైల్. సమయంతో పరుగులు తీయడం వేళా పాళా లేకుండా  ఎప్పుడు  గ్యాప్ దొరికితే అప్పుడు  తినడం...మళ్ళీ యధా విధిగా  బిజీ అయి పోవడం. ఆ తిండైనా మంచి ఆహారం తీసుకుంటున్నారా అంటే, అది ఇంకా అధ్వానం. ఈ రోజుల్లో ప్రజలు ఫాస్ట్  ఫుడ్ కి అలవాటు పడ్డారు. అందులో ఎలాంటి  ఆయిల్ వాడుతున్నారు..క్వాలిటీ పదార్ధాలు వాడుతున్నారా అని పట్టించుకుని తినడం అసలు మానేశారు.
సమయానికి నిద్ర పోవడం...సమయానికి లేవడం సంగతి ఇక సరే సరి. కానీ  ఈ విధానం  మును ముందు మానవ జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలుసుకొని జాగ్రత్త పడడం చాలా అవసరం. లేదంటే అందుకు మూల్యం చెల్లించక తప్పదు. ప్రస్తుత రోజుల్లో ఎంత చిన్న హాస్పిటల్ ముందైనా ఓ పెద్ద క్యూ ఉంటోంది. ఇక కాస్త పేరున్న డాక్టర్ అప్పోయింట్ మెంట్ దొరకాలంటే అతి కష్టం అయిపోతుంది. ఇవన్నీ ఎక్కువ మంది ప్రజల రోగ నిరోధక శక్తి దృఢంగా లేకపోవడమే.
దీనికంతటికీ మూల కారణం ప్రజల ఆరోగ్యం పట్ల చూపే నిర్లక్ష్యం. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం గురించి తప్పక శ్రద్ద తీసుకోవాలి. పాత కాలంలోలా తిండి తినక పోయినా పర్వాలేదు. ఆహారం మరియు మన శరీరానికి విశ్రాంతి  వంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. బలమైన ఆహారాన్ని వ్యాధి నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఇంటి  భోజనం తినడం..అందులోనూ సమయానికి తినడం ముఖ్యం. శరీరానికి తగిన విశ్రాంతిని సరైన సమయంలో ఇవ్వాలి. అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉండి...తన ఆయుష్షు మరింత పెరుగుతుంది. అలాగే వ్యాధులకు దూరంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: