విజయం మీదే: ఏ పనైనా ఆటంకం లేకుండా పూర్తి చెయ్యాలి...!
వారి రచనల ద్వారా కాని వాటిని మనం పట్టించుకోకుండా ఉండడం చాలా దురదృష్టకరం. పాడగా పాడగా చక్కటి గాయకుడిగా తయారవ్వచ్చు. తినగా తినగా చేదైన వేపాకు కూడా తియ్యగా తయారవుతుంది. చేయగా చేయగా అంటే మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఏ పనైనా సరే విజయవంతం అవుతుంది. ఈ విషయాన్ని మనం మర్చిపోతుంటారు . ఇప్పుడు ఇదే మన జీవితంలో అపజయానికి పెద్ద కారణం . మీరు ఖచ్చితంగా జీవితంలో విజయం పొందాలంటే ఏ పనినైనా నిరాటంకంగా కొనసాగించాలి.
మీరు ఒక విద్యార్థి అయితే మీరు నిరాటంకంగా చదివినట్లయితే మీరు మంచి మార్కులతో పాస్ అవడం జరుగుతుంది. మరియు మీయొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా చాలా మెరుగు పడుతుంది. బయటి ప్రపంచంలో ఎలాంటి పోటీ నైనా మీరు తట్టుకోగలరు నిరాటంకంగా చదివినప్పుడు. కాలేజీ పని దినాలలో మీరు సరిగా హాజరు కాకుండా ఉండడం వలన అది నీకే పెద్ద నష్టాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే నీ యొక్క పని ఫలితం నువ్వు మాత్రమే అనుభవించాల్సి వస్తుంది. ప్రతి రోజు కాలేజీకి హాజరై ప్రతి క్లాసులు శ్రద్ధగా వింటూ చదువుతూ ఉండు ఈ ప్రక్రియను నువ్వు నిరాటంకంగా కొనసాగించినట్లు అయితే విజయం పొందడం లో నిన్ను ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. కాబట్టి మొదలు పెట్టిన ఏ పనిని అయినా సరే ఆటంకం లేకుండా పూర్తి చేయాలి.