విజయం మీదే: ఎంతటి బాధయినా మనము చూసే దాన్ని బట్టే ఉంటుంది...?

VAMSI
జీవితంలో ప్రతి ఒక్కరికీ సుఖాలు, బాధలు, కష్టాలు సహజంగా వస్తుంటాయి. కానీ మనకు కలిగిన ఎటువంటి బాధ అయినా కానీ, ఆ బాధను ఒక చిన్న సమస్యగా చూస్తే కనుక అది మనపై పెద్ద ప్రభావం చూపించదు. ఒక వేళ అదే సమస్యను పెద్దదిగా ఊహించుకుంటే అది మనకు తీరని బాధగా ఉంటుంది. మనపై తీర్వ ప్రభావాన్ని చూపిస్తుంది. మన రోజువారీ జీవితంలో తీరని నష్టాన్ని మిగులుస్తుంది. అయితే దీనిని తెలిపే ఒక చిన్న కథను తెలుసుకుందాము రండి. ఒక కళాశాలలో ఒక అధ్యాపకుడు విద్యార్థులకు సైకాలజీకి సంబంధించిన ఒక క్లాసు చెబుతున్నారు....ఆ తరగతి ఉపాధ్యాయుడు... పాఠంలో భాగంగా... ఒక నీటితో నిండిన ఒక మంచి నీటి గ్లాసును చూపించి... దీని బరువు చెప్పగలరా అని అడుగుతారు.
చాలా మంది దాదాపు 150 గ్రాములు... అని చెపుతారు... దానికి వివరణ ఇస్తూ... దీని వాస్తవ బరువు కొద్ది గానే కావచ్చు... కానీ నేను దీనిని కేవలం ఒక నిమిషం మోస్తే.. బరువు తెలియదు. అదే పది నిమిషాల సేపు మోస్తే... కొద్దిగా బరువు అనిపిస్తుంది... అదే ఒక గంట మోస్తే.. నా భుజం నొప్పి లేచేంతగా బాధిస్తుంది... అదే ఒక రోజంతా మోయా లని ప్రయత్నిస్తే మాత్రం... నా చెయ్యి పని చేయలేనంత బాధ వేస్తుంది. మనకు కలిగే కష్టాలు కూడా అంతే కొద్ది సేపు మాత్రమే వాటిని తలచుకుంటే బాధ ఉండదు. కొన్ని గంటల పాటు... తలచుకుంటే కొంత బాధగా ఉంటుంది... అదే రోజంతా తలచుకుంటే... ఇక ఏ పనీ చేయలేం.. ఏమీ సాధించలేము... అందుకే ఒక చిన్న కలతను వదలక పోతే అది చింతగా మారుతుంది.
ఆ చింత వ్యధగా మారి మనో వ్యధకు దారి తీస్తుంది... బాధలైనా/కష్టాలైనా/కన్నీళ్ళైనా మనం ఫీల్ అయిన దానిని బట్టే ఉంటుంది... అందుకే వాటిని ఎంతగా తలుస్తున్నామనేదే ముఖ్యం... అలాంటి పరిస్థితి వచ్చినపుడు మనం ఎంత త్వరగా గ్లాసును క్రిందకు దించుతామో... మన బాధనయినా అలాగే వదిలించుకుని బయట పడటం మంచిది. ఈ విషయం గుర్తు పెట్టుకుని ముందుకు సాగిపోతే ఎటువంటి బాధనయినా తట్టుకుని విజయాన్ని సాధించగలుగుతారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: