విజయం మీదే: ఈ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మీ చెంతకు రాదు...?

VAMSI

కోవిడ్-19 మహమ్మారి 2020 మార్చి నుంచి మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇప్పుడు మనము క్యావాల్సినది అ అంతా ఒక్కటే...ఈ కరోనా వైరస్ బారినపడకుండా  అప్రమత్తంగా ఉండటం మరియు కరోనా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకోవడం. కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడానికి మరియు మిమ్మల్ని మరియు ఇతరులను సంరక్షించుకోవడంలో సహాయపడటానికి మీరు తీసుకోగల  సులభమైన కొన్ని పనులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ కరోనా వైరస్అ అంటు వ్యాధి కావడం మన దురదృష్టం. ఇది ముఖ్యంగా మన ముక్కులో నుండి వచ్చే రేణువుల ద్వారా మరియు మనము దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మనిషి నుండి మనిషికి అత్యంత సాధారణంగా వ్యాప్తి చెందుతుంది. ఒకరిని ఒకరు కరచాలనం చేయడం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది.  


కాబట్టి వైరస్ సోకిన వారితో సామాజిక దూరం పాటించడం ఉత్తమం. బహిరంగ ప్రదేశాల్లో ఇతరుల నుంచి సుమారు 6 అడుగుల దూరాన్ని నిర్వహించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. తద్వారా దగ్గు లేదా తుమ్ము ల ద్వారా ఉత్పత్తి చేయబడే శ్వాస బిందువులను నేరుగా తాకకుండా ఉండటానికి ఈ దూరం మీకు సహాయపడుతుంది. మంచి పరిశుభ్రతను పాటించడం అనేది ఒక ముఖ్యమైన అలవాటు. ఇది కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడానికి సహాయపడుతుంది.  మీ చేతులను సబ్బు మరియు నీటితో కనీసం 20 సెకండ్ల పాటు శుభ్రం చేసుకోండి. మీరు ఏ సమయాలలో మీ చేతులను శుభ్రపరుచుకోవాలి ఇక్కడ తెలుసుకోండి.  ఆహారం తినడానికి లేదా తయారు చేయడానికి ముందు, మీ ముఖాన్ని తాకడానికి ముందు, రెస్ట్ రూమ్ ఉపయోగించిన తరువాత,  ఒక బహిరంగ ప్రదేశాన్ని విడిచిపెట్టిన తరువాత,  ముక్కు ఊదడం, దగ్గడం లేదా తుమ్మడం తరువాత,  మీ మాస్క్ హ్యాండిల్ చేసిన తరువాత, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని చూసుకున్న తరువాత..పైన తెలిపిన అన్ని సమయాలలోనూ ఖచ్చితంగా చేతులను శుభ్రంగా కడుక్కోవలెను. 


కొన్ని సమయాలలో మీరు బయట ఉన్నప్పుడు సబ్బు అందుబాటులో లేకపోతే, కనీసం 60% ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించండి. మీ చేతుల యొక్క అన్ని వైపులా శానిటైజర్ తో కవర్ చేయండి మరియు అవి పొడిగా అనిపించేంత వరకు వాటిని కలిపి రుద్దండి.  మీ కళ్లు, ముక్కు మరియు నోటిని కడుక్కున్నా తరువాత చేతులతో తాకవద్దు.  మీ నోరు మరియు ముక్కును మాస్క్ తో ధరించడం ద్వారా కరోనాను రాకుండా జాగ్రత్త వహించవచ్చు. ఇటువంటి సమయంలో ప్రయాణాలు చేయడం చాలా ప్రమాదకరం. కాబట్టి ప్రయాణాలను రద్దు చేసుకోవడం ముఖ్యం.  పై జాగ్రత్తలను సక్రమంగా పాటించినట్లయితే మీరు కరోనాను నియంత్రించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: