విజయం మీదే: పెళ్లిలో జరిగే గొడవలకు ఇలా బ్రేక్ వేయండి...?

VAMSI
పెళ్లి అనేది ఇద్దరి వ్యక్తుల జీవితాలను ఏకం చేసే ఒక శుభ పరిణామం. ఇద్దరి వ్యక్తులతో పాటు రెండు కుటుంబాలను సైతం ఒకటిగా కలుపుతుంది. బంధాలను, బాంధవ్యాలను పెంచుతుంది. మన హిందువులకు ఇదో పెద్ద వేడుక. మన పూర్వీకుల నుండి వస్తున్న ఒక ఆచారం. హిందూ వివాహం ఆధునిక అర్ధంలో చెప్పబడే ఒక సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు మతపరంగా కూడా ఎంతో పవిత్రమైనది, ప్రత్యేకమైనది. ప్రాంతాలను బట్టి, కులాలను బట్టి వివాహ వేడుక జరిగే విధానంలో కాస్త వ్యత్యాసం కనిపించినా మన దేశంలో జరిగే వివాహాలన్నీ ఒకే పద్ధతిలో ఉంటాయి. మన హిందూ వివాహ సంప్రదాయంలో ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. మొదటగా ఇరు కుటుంబాల వారు ఇరువర్గాల వారి కుటుంబ వివరాలను తెలుసుకుంటారు. ఆ తర్వాత పెళ్లి చూపులు పేరుతో ఇరు కుటుంబాలు ఒక చోట చేరుతాయి. 


అమ్మాయికి అబ్బాయికి ఒకరికొకరు నచ్చితే..ఆ తర్వాత రెండు కుటుంబాలు మిగిలిన విషయాల గురించి మాట్లాడుకుంటారు. ఇక అప్పటినుండి ఎన్నో తతంగాలు ఉన్నాయి. నిశ్చితార్థం, స్థాతకం, ఎదురుకోలు, గౌరీపూజ, శుభలేఖలు పంచే కార్యక్రమం, పెళ్ళికి ముందు మంగళస్నానాలు, ఆ తర్వాత పెళ్లి. ఇలా ఎన్నో సంప్రదాయాలతో ముడిపడిన అందమైన కలయికే కళ్యాణం. ఇక మన తెలుగు వారైతే పెళ్ళిలో ఎంతో సందడి చేస్తూ,విందు వినోదాలంటూ ఎంతో హడావిడి చేస్తుంటారు. ఇక ఆడపెళ్ళివారైతే మగపెళ్ళివారికి ఎటువంటి లోటు రాకుండా ఉండడం కోసం ఎంతో జాగ్రత్తగా ఉంటూ అన్ని విషయాలను దగ్గరుండి చూసుకుంటారు. వాస్తవానికి మగపెళ్లివారు కాస్త బెట్టు కూడా చూపించే సందర్భాలు చూస్తూనే ఉంటాము.


ఇలాంటి సమయాల్లో కనుక ఏదైనా ఒక చిన్న గొడవ మొదలై అది పెద్ద వివాదానికి దారి తీసే అవకాశం, లేకపోలేదు. ఇలాంటి ఎన్నో సందర్భాలు పలు పెళ్లిలో చూసుంటాము. కొన్ని సార్లు పీటలపై పెళ్లికూడా ఆగిపోయే పరిస్థితికి చేరుకుంటుంది. అయితే ఒకవేళ పొరపాటున ఇలాంటి సందర్భాలు ఎదురైతే వాటిని పెద్దవి కాకుండా ఎలా సద్దుమణిగించాలో కొన్ని సూచనల ద్వారా తెలుసుకుందాం. ముందుగా తప్పు ఎవరివైపు ఉన్నా... ఆ సంగతి వదిలేసి గొడవను తగ్గించేందుకు కాస్త నెమ్మదిగా మాట్లాడుతూ తప్పు ఎవరిదైనా దయచేసి  కాస్త సర్థుకుపోండి, పెద్దమనసు చేసుకొని కాస్త ఆలోచించండి, వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం లాంటి మాటలు మాట్లాడి గొడవను తగ్గించే ప్రయత్నామ్ చేయాలి.


అప్పటికీ కుదరకపోతే ఎవరైతే గొడవ పడుతారో వారిద్దరిని పక్కకు తీసుకెళ్లి అవతలవాళ్ళదే పొరపాటు, కానీ మంచి మనసుతో మీరే కాస్త అర్ధం చేసుకుని ముందుకు సాగుదాం అంటూ వారివైపు మాట్లాడినట్టుగా మాట్లాడి సర్ధిచెప్పాలి. అలా కూడా కుదరకపోతే ఇరు వర్గాల పెద్దమనుషులను కూర్చోపెట్టి తప్పు ఎవరిదైనా జరగాల్సిన శుభకార్యాన్ని దృష్టిలోఉంచుకొని ఇరువురు ఒక మాటమీదకు వచ్చేలా చేయాలి లేదా కనీసం ప్రస్తుతానికి సర్దుకుపోయి పెళ్లి తర్వాత మాట్లాడుకుందాం అన్నట్టుగా ఎవరైనా పెద్ద మనుషులతో, అంటే ఎవరు చెప్తే అవతలివారు కాస్త తగ్గుతారో అలాంటి వారితో చెప్పించాలి. ఆ తర్వాత పెళ్లి తంతు సజావుగా జరిగేలా చూడాలి. ఈ విధంగా పెళ్ళిలో జరిగే గొడవలకు పుల్ స్టాప్ పెట్టొచ్చు...!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: