విజయం మీదే: ఈ విషయం తెలుసుకో ... లైఫ్ అంతా హ్యాపీనే ?
సమస్య వచ్చినప్పుడు రేపు నా జీవితం ఏమైపోతుందో అంటూ పరుగులు తీయకుండా, సమయ స్ఫూర్తితో ప్రస్తుతం ఆ సమస్యను ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. అలాగే సంతోషంగా ఉన్న సమయంలో రేపు ఈ సంతోషం ఉంటుందో లేదో అన్న ఆలోచనతో ఉన్న ఆనందాన్ని అనుభూతి చెందకుండా మిస్ చేసుకోకూడదు. సమయానుసారంగా నడుచుకుంటూ వీలైనంతలో ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే జీవితం అందంగా కనిపిస్తుంది, మనశ్శాంతి దొరుకుతుంది. బ్రతకాలి అనే ఆలోచన మరింత పెరుగుతుంది. అలా కాకుండా అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటే జీవితంలో చిన్నచిన్న సంతోషాలకి కూడా దూరమై భవిష్యత్తు అంధకారంగా మారుతుంది.
ఏదేమైనా అంతా మీ చేతుల్లోనే ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అప్పుడే జీవితం సాఫీగా సంతోషంగా సాగుతుంది. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా సందర్భానికి తగ్గట్టు సమయ స్ఫూర్తిగా నడుచుకోవడమే, సమస్యలను చూసి కృంగి పోకుండా, సంతోషాలను చూసి పొంగి పోకుండా అన్నిటినీ సాదరంగా ఆహ్వానిస్తూ చిరునవ్వుతో జీవించడం నేర్చుకోవాలి. మిమల్ని చూసి పది మంది నేర్చుకునేలా మీరు మీ జీవితాన్ని మలచుకోవాలి .