వట్టిమాటలు కట్టిపెట్టి.. గట్టమేల్ తలపెట్టవోయ్! అన్న గురజాడ వాక్కులను స్ఫూర్తిగా తీసుకున్న ప్రముఖ టెక్ దిగ్గజం.. కోటీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్.. అధినేత సరిపల్లి కోటిరెడ్డి సమాజానికి చేస్తున్న సేవ నిరుపమానం. నేనున్నాను.. అంటూ.. ఆయన ఆపదలో ఉన్న పేదలకు, అవసరంలో ఉన్న వ్యక్తులకు, సంస్థ ఉద్యోగులకు అనేక రూపాల్లో సాయం చేస్తూ.. తన దయార్ద్ర హృదయాన్ని చాటుకుంటున్నారు. ఉద్యోగుల కుటుంబాల్లో ఏ సమస్య వచ్చినా.. తన భుజాలపై వేసుకుని వాటిని పరిష్కరిస్తూ.. తనమనసు చాటుకుంటున్నారు.
ఇక, హిందూ ధర్మ పరిరక్షణకు తనవంతు సేవ చేస్తున్నారు కోటిరెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్లో నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు ఆయన ప్రతి నెలా ఇతోధికంగా నగదును జమచేస్తూ.. ఆలయాలకు వచ్చే భక్తులకు స్వామి ప్రసాదంగా అన్నం అందించే కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఈ భూరి విరాళలు కూడా ప్రతి నెలా తన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనం ఇచ్చే రోజునే ఇస్తుండడం మరింత విశేషం. అదేవిధంగా పేదలకు.. అవసరంలో ఉన్న వారికి ఆయన చేసిన గుప్త దానాలు.. అనేకం.
ఇక, తన సొంత గ్రామంలో కోటిరెడ్డి.. అమ్మవారి ఆలయాన్ని నిర్మించడంతోపాటు.. భారీ విరాళాన్ని కూడా అందించారు. ఏపీలోని కృష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకాలోని జనార్థన పురం ఆయన స్వగ్రామం. అదేవిధంగా కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డవారిని ఆదుకునేందుకు, తన సొంత ప్రాంతంలో ప్రజల ఆకలి తీర్చేందుకు నెలల తరబడి.. అన్నదానం చేసిన దయార్ద్ర హృదయుడు కోటిరెడ్డి.
కరోనా కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని వారికి అక్కడ రోజుల పాటు అన్నదానం నిర్వహించారు. నేటి రోజుల్లో పది రూపాయలను ఉచితంగా ఎవరికైనా ఇచ్చేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచించుకునే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో తన సంస్థ ఉద్యోగులను కంటికి రెప్పలా కాచుకుంటూ.. సమాజానికి కూడా సేవ చేస్తున్న కోటిరెడ్డి నిజంగానే దయార్ద్ర హృదయుడే..!