ప్రస్తుతం జర్నలిజం రంగం గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత ఎక్కువ మంచిది అనే పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం.. ఈ రంగంలో పనిచేసినంత వరకు చేయించుకుని.. సదరు ఉద్యోగికి ఏ కష్టం వచ్చినా.. పట్టించుకోని సంస్థలు కోకొల్లలు. తలపండి.. తెలుగు జర్నలిజాన్ని శాసించిన ప్రధాన మీడియా సంస్థలే ఉద్యోగుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నాయి. అందునా..కరోనా సమయంలో ఏ సంస్థ కూడా తమ ఉద్యోగులకు అండగా నిలిచిన పరిస్థితి లేదు. కానీ, ఇలాంటి పరిస్థితికి భిన్నంగా ప్రముఖ ఐటీ దిగ్గజం.. సరిపల్లి కోటిరెడ్డి అధినేతగా ఉన్న ఇండియా హెరాల్డ్.. లో మాత్రం ప్రతిఒక్కరినీ పనివారుగా కాకుండా.. కోటి వసుధైక కుటుంబంగా భావిస్తారు.
ప్రతి ఆథర్ను సొంత కుటుంబ సభ్యులుగా భావించే పరిస్థితి ఒక్క హెరాల్డ్కే సొంతం అంటే అతిశయోక్తి కాదు. పనిచేసినంత సేపు చేయించుకుని తర్వాత ఏదైనా కష్టం వస్తే.. వదిలేసే సంస్థలున్న ఈ రోజుల్లో తన సంస్థలో పనిచేసే.. ఆథర్కు ఏ కష్టం వచ్చినా.. నేనున్నానని ఆదుకోవడం కోటిరెడ్డికి పెన్నుతో పెట్టిన విద్య. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా.. వెంటనే ఆదుకోవడంతోపాటు.. సున్నా వడ్డీ రుణాలు ఇచ్చి.. నెలకింతని జీతం నుంచి మినహాయించుకుంటూ.. ఆపదలనుంచి గట్టెక్కించే తత్వాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. ఆధర్స్కు ఇచ్చిన అమౌంట్ అంతా వారు కట్టలేకపోతే రాయితీలు కూడా ఇవ్వడం కోటిరెడ్డికే సొంతం.
దీంతో హెరాల్డ్ ఉద్యోగులు ఎవరూ ఉద్యోగులుగా ఫీలవరు. ఒక కుటుంబంగా భావిస్తారు. ఇక, వెబ్సైట్ను వ్యాపారం కోసం, వాణిజ్యం కోసం కాకుండా.. కుటుంబంగా భావించే అధినేతగా కోటిరెడ్డి భిన్నమైన శైలితో ముందుకు సాగుతున్నారు. ఉద్యోగులు, ఆధర్స్ పెళ్లిళ్లకు కూడా ఆయన కానుకలు పంపుతూ.. వారి వృద్ధిని కోరుకుంటున్న సంస్థ అధినేతగా ఆయన నిలుస్తున్నారు. వాస్తవానికి ఫ్రీలాన్స్ జర్నలిజంలో ఏ సంస్థలో అయినా.. ఇలాంటి పరిస్థితి ఉండదు. కానీ, ఇండియా హెరాల్డ్ లో మాత్రం భిన్నమైన శైలిలో ఉండడం గమనార్హం. అందుకే ఈ సంస్థలో పనిచేసే వారు ఉద్యోగులుగా కాకుండా.. వసుధైక కుటుంబంగా భావిస్తుండడం గమనార్హం.