విజయం మీదే: పిల్లలకు మనమిచ్చే ఆస్తులేవో తెలుసా?

VAMSI
ఒక్కొక్కరి జీవితంలో విజయం అనేది ఒక్కో విధంగా ఉంటుంది. కొందరికి ఉన్నత విద్యలను అభ్యసించడమే వారి జీవిత లక్ష్యంగా ఉంటారు. మరి కొందరు ఫేమస్ కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని ఆశపడుతుంటారు. ఇంకొందరు తమ పిల్లల భవిష్యత్తే తమ విజయంగా జీవిస్తుంటారు. మేము ఎంత కష్టమైనా భరిస్తాము కానీ మా పిల్లల భవిష్యత్తు మాత్రం ఎంతో సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటుంటారు. ఆలాంటి వారు వారి లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి అంటే వారికి ఒక ప్రణాళిక అనేది ఖచ్చితంగా అవసరం. వారి పిల్లల బంగారు భవిష్యత్తే వారి అసలైన విజయం అనుకున్నప్పుడు అందుకు తగ్గట్లుగా వారి పిల్లల్ని తీర్చిదిద్దుకోవలసి ఉంటుంది. ఈ రోజుల్లో మన బిడ్డలకు మనమే ఇచ్చే గొప్ప గొప్ప ఆస్తి పాస్తులు ఏమిటంటే విలువలు.
మంచి నడవడిక, ఉన్నతమైన విద్య, జీవన విధానం పట్ల స్పృహ ఇవే పిల్లలని రేపటి సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. ముందుగా పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మంచి అలవాట్లను, సత్ప్రవర్తనను అలవాటు చేయాలి. విద్య పై వారికి ఆసక్తి పెరిగేలా చూసుకోవాలి. వారిలో ఉన్న ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలి. ప్రత్యేకమైన పనికి ప్రణాళిక అనేది అవసరమన్న విషయాన్ని చిన్నప్పటి నుండే అలవాటు చేయాలి. ముఖ్యంగా సమయానికి విలువ ఇచ్చి అందుకు అనుగుణంగా నడుచుకునే ప్లానింగ్ ఉండాలని తెలియచేయాలి. తమకంటూ ఒక లక్ష్యం ఉండేలా ప్రేరేపించాలి.
ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లల్ని పెంచాలి. పిల్లల్ని కష్టపెట్టే నేర్పించడం కన్నా వారు ఇష్టపడే లా చేసి నేర్పిస్తే ఎక్కువ కాలం గుర్తుంటుంది. విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియచేయాలి. ఇలా చేయడం వలన మీ పిల్లలు ఒక మంచి జీవన విధానానికి అలవాటు పడతారు, విద్యలో ముందుంటారు. విద్య వారికి మంచి ఉన్నత ఉద్యోగాలు అందేలా చేస్తే వారి సత్ప్రవర్తన సమాజంలో గౌరవింపబడేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: