విజయం మీదే: విద్య ఉంటేనే విజయమా?
అయితే ఇక్కడ విజయం అందుకున్నది ఎవరు ఓడిపోయింది ఎవరూ...ఎందుకు అంటే.!??
ఈ ప్రశ్న చాలా మందిని వేదిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్దం చేసుకోవాల్సిన అంశం ప్రతి విషయాన్ని గెలుపోటములతో ముడి పెట్టలేము. మంచి చదువు, ఉన్నత స్థాయిలో ఉన్న వారిని ఈ సమాజం గౌరవిస్తుంది. అరకొర బ్రతుకులతో కాలాన్ని వెళ్ళదీసే వారిని ఈ సమాజంలో చాలా మంది చులకన భావంతో చూస్తారు . ఇది నిజమే కానీ అంతమాత్రాన వారు అస్సలు ఎందుకు పనికి రాని వ్యక్తులు అని కాదు. అయినా ఇలాంటి మాటలకు దూరంగా విజయానికి దగ్గరగా ఉండాలి అంటే ముందునుండే మీ జీవితాన్ని ఒక ప్రణాళిక ప్రకారం కొనసాగించండి. చదువులను బట్టీ పట్టడం కాదు , అర్దం చేసుకోవాలి.
అలాగే నేటి రోజుల్లో మార్కులు కూడా ఎంతో కీలకం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ నడవాలి. అప్పుడే అనుకున్న ఉన్నతిని సాధించగలరు. లేదా మీకు మక్కువ ఉన్నా, లేదా మీరు ప్రతిభావంతులైన అంశంలో పైకి ఎదిగేందుకు మార్గాన్ని ఏర్పరచుకోవాలి.