విజయం మీదే: ఈ 3 లక్షణాలు లేకుంటే... డబ్బు ఎందుకయ్యా?

VAMSI
ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి ప్రతి విషయంలో పైచేయిగా ఉండాలి అనుకుంటాడు. అందుకోసం పడరాని పాట్లు పడతాడు. కానీ ఈమార్గంలో కొన్ని ముఖ్యమైన విషయాలను పట్టించుకోడు. అయితే మనము ఎంత సుతఃయికి ఎదిగినా కొన్ని లక్షణాలు మనలో లేకుంటే ఆ సక్సెస్ కు అర్ధమే ఉండదు. అంత ముఖ్యమైన లక్షణాలు ఏమిటో ఒకసారి చూద్దాం.

1. సంతృప్తి

మనము నిత్యం ఏదో ఒక పని చేస్తూ ఉంటాము. కానీ మనం చేసే పనిలో న్యాయం అన్యాయం ఉందా అనే విషయం కొన్ని సార్లు మిస్ అవుతూ ఉంటాము. అయితే అది తెలిసి అయినా తెలియక అయినా తప్పు తప్పే, మీరు చేసే ఈ అన్యాయమైన పని వలన ఎవరో ఒకరో నష్టపోతారు. అలాంటప్పుడు ఒకరిని నష్టపరిచే మీరు సుఖ పడడం లేదా లాభపడడం  ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరే ఆలోచించుకోవాలి. ఇలా ఆలోచిస్తే ఖచ్చితంగా
మీకు సంతృప్తి ఉండదు. కాబట్టి సంతృప్తి దొరికే క్రియలను చేయడం ప్రధానం అని తెలుసుకోండి.

2. ఆశ

మానవుడిగా పుట్టాము కనుక మన చుట్టూ జరిగే అనేక పనుల చేత ప్రేరేపించబడి ఉంటాము. అలా మనకు ఎన్నో కోరికలు పుడతాయి...ఆ కోరికలే ఆశలుగా మారిపోతాయి. మనకు ఉన్నది చాలు అనుకుంటే హాయిగా ఉంటాము. అది మనకు దక్కదు అని తెలిసినా దాని కోసం ప్రయత్నించడం ఆశ అవుతుంది. ఆశ అనేది ఎంత ప్రమాదమో మీకు ఇప్పుడే తెలియదు. కొన్ని అనుభవపూర్వకంగా తెలుసుకంటేనే జీవితాంతం గుర్తుండిపోతాయి.

3. దానగుణం

మనము కష్టపడి ఎన్నో సాధిస్తాము. కోట్ల ఆస్తులు పోగేస్తాము, అయితే ఇన్ని ఆస్తులు అంతస్తులు ఉన్నా మనసుకు సంతోషం కలగదు. హ్యాపీగా ఉండాలని అనుకుంటూ ఉంటాము. కానీ ఉండలేము.  అయితే మనకున్న దానిలో లేని వారికీ ఇచ్చి చూడు ఆ సంతోషమే వేరు. ఇది చాలా మందికి తెలియక  మనమే గొప్ప అనుకుంటూ ఉంటారు. ఉన్నోడు గొప్పోడు కాదు. తనకున్న పావలాలో సగం అయినా లేనోడికి ఇచ్చేవాడే నిజమైన గొప్పవాడు.

పైన మనము చెప్పుకున్న త్రీ లక్షణాలు మనలో లేనట్లయితే ఎంత పైస్థాయిలో ఉన్నా ఏమి లేనివాడితోనే సమానం.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: