
విజయం మీదే: పీజీ చేసిన అమ్మాయి టీ షాప్ పెట్టింది.
ఒక మహిళా ఎంతో కష్టపడి ఎం ఏ ఇంగ్లీష్ చేసింది. తాను ఎప్పటికైనా ఇంగ్లీష్ టీచర్ కావాలని అనుకునేది. అయితే కాలం కలిసి రాలేదు. అయితే తాను అనుకున్నట్లుగా ఇంగ్లీష్ టీచర్ కాలేకపోయింది. ఆఖరికి ఒక చిన్న ఉద్యోగం కూడా పొందలేక తీవ్ర నిరాశలో ఉంది. కానీ అక్కడే ఉండిపోలేదు తన ఆలోచనలను మూటగట్టుకుని ఒక బలమైన కార్యం వైపు వెళ్లేలా చేసింది. ఒక టీ స్టాల్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. దీనికి ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేకపోవడంతో ఈ దిశగా ఆలోచన చేసింది. అయితే మొదట్లో ఇంట్లో తన తల్లితండ్రులు మహిళ ఏమిటి టీ స్టాల్ పెట్టడం అని వాదించారు. కానీ తన సంకల్పం ముందు వారి మాటలు నిలబడలేదు.
కట్ చేస్తే హాబీరా రైల్వే స్టేషన్ లో ఒక షాప్ పెట్టింది. ఇక్కడ టీ మరియు స్నాక్స్ కూడా అమ్మడం స్టార్ట్ చేసింది. అక్కడకు వచ్చే వారు మొదట ఆశ్చర్యపోయినా ఆమె కథ విని ఎంతో సంతోష పడ్డారు. అందుకే చేసే పనిలో ఏమీ ఉండదు. కష్టపడాలే కానీ పని ఏదైనా ఒకటే అని నిరూపించి చూపించింది. ఈమెను చూసి ఎందరో మహిళలు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు.