విజయం మీదే: పాజిటివ్ ఆలోచనలే మీ ఆయుధం?
ఎల్లపుడూ పాజిటివ్ గా ఆలోచిస్తే అన్ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. అదే నెగెటివ్ వేలో ఆలోచిస్తే వచ్చిన అదృష్టం కూడా దరిద్రంగా మారి మనిషిని సరైన సమయంలో కష్టాల వలలో పడేస్తుంది. అందుకే పెద్దలు అంటుంటారు ఏదైనా సరే అంతా మన మంచికే అనుకోవాలి. పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తిని ఏ సమస్య అయినా బాదించలేదు. విషం కూడా చంపలేదు. అదే నెగిటివ్ గా ఆలోచించే వ్యక్తికి ప్రతిదీ పెద్ద సమస్య లాగే కనిపిస్తుంది. ఎటువంటి వారికి ఏ మెడిసిన్ కూడా బాగు చేయలేదు.
అయితే చాలా మందికి ఎంతగా అనుకున్న నెగెటివ్ గా ఆలోచించకుండా ఉండలేరు. ఇలాంటి వారు తాము అనుకున్న వాటిని అంత సులువుగా అందుకోలేరు. విజయాన్ని అందుకోవడం కష్టమే అవుతుంది. అయితే ఈ నెగిటివ్ ఆలోచనలను దూరం చేసుకోవడానికి కొన్ని సలహాలను పాటించాలి. ఆలా చేస్తే ఒకవేళ మీకు నెగిటివ్ ఆలోచనలు ఉన్నా దరి చేరకుండా ఉంటాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. అంతే కానీ పక్కన వారి మాటలు మరియు పనుల పట్ల ప్రభావితం కాకండి. ఎక్కువ సమయాన్ని బుక్స్ చదువుతూ గడపండి. అందరి పట్ల సానుకూలంగా ఉండండి.