విజయం మీదే: ఈ లక్షణాలు లేకుండా మనిషి ఉంటాడా?
మీరు సంతోషకరమైన మరియు సంతృప్తికరమైన జీవితం పొందాలంటే ఇవన్నీ తప్పని సరిగా కలిగి ఉండాలి. ప్రతిక్షణం ఏదో ఒక సమయంలో ఇవి మీతో మిళితమై ఉంటాయి. ఇటువంటి భావాలు కలిగి ఉన్న వారు తాత్కాలికంగా విజయం పొందుతారు, కానీ ఆ విజయం దీర్ఘ కాలం మిమ్మల్ని ఆదరించలేదు. అలాగే మీకు పరిపూర్ణంగా ఉపయోగపడదు. ఇతరుల సంతోషంలో ఆనందాన్ని వెతకమని చెప్పడం లేదు. కానీ ఇతరుల దుఃఖానికి మాత్రం మీరు కారణం కాకపోతే చాలు. వీలైనంతలో తోటి వారికి సహాయం చేయండి. మీరు ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఆ సహయమే మీకు మరో రూపంలో మీకు చేయూత అందిస్తుంది.
మీరు జీవించిన పూర్తి కాలంలో నలుగురు గుర్తించుకునేలా ఉండాలి. అంతే కానీ వీడు ఏమి మనిషిరా అనేలా ప్రవర్తించకూడదు. ఇది అంత ఈజీగా మీకు అలవాటయ్యే లక్షణాలు కాదు. మీరు మీరులా ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి మీ చుట్టూ జరిగే ప్రతి ఒక్క విషయం జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు పొరపాట్లు జరగడానికి అవకాశం ఉండదు.