విజయం మీదే: దిగులు, బాధ లక్ష్యానికి శత్రువులే?

VAMSI
శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. కృషి, పట్టుదల నీ వెంట ఉంటే విజయం నీ ముందు నిలుస్తుంది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లక్ష్యం ఉండనే ఉంటుంది. ఒక్క ప్రయత్నం లోనే అద్భుతం జరగాలి అంటే అత్యాశే అవుతుంది. మహామహులు సైతం లక్ష్యాన్ని చేదించడానికి ఎన్నో తిప్పలు పడుతుంటారు. ఎవరైతే అన్నిటినీ అధిగమిస్తూ, కష్టాన్ని ఇష్టంగా ఆహ్వానిస్తూ దైర్యంగా ముందుకు సాగి ప్రయాణాన్ని చివరి వరకు కొనసాగించగలరో వారే విజయాన్ని అందుకోగలరు. ఇక కష్టం వస్తే దిగులుతో కూర్చుంటే సమస్య తీరదు సరికదా, పరిష్కార మార్గం కూడా కనిపించదు.
సమస్యను తలుచుకుంటూ దిగులుగా ఉంటే ఉపయోగం ఉండదు. దిగులు అనేది  సమస్యకు పరిష్కారం కాదు అలాగే ఔషధము కాదు. దిగులు అనేది చేసిన తప్పుకు పరితపించడం కూడా కానే కాదు. మన విజయాన్ని ఆపే ఒక అడ్డు గోడ. దిగులు మన భవిష్యత్తును శూన్యంగా చూపిస్తుంది. ఏమి జరిగిపోతుందో అనే ఆలోచనలతో మనిషిని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది. అందుకే సమస్య వచ్చినప్పుడు దిగాలుగా కూర్చోవడం కాదు, మనసుని దృఢం చేసుకుని సంకల్ప బలంతో ముందుకు నడవాలి.
దాంట్లో నమ్మకం చాలా ముఖ్యంగా మనపై మనకు నమ్మకం లేకపోతే ఎంత కష్ట పడినా ప్రయోజనం ఉండదు.  మధ్య లోనే వెనుతిరగవలసి వస్తుంది . ఏదైనా సాధించగలను, ఎంత వరకైనా పోరాడ గలను అని మనల్ని మనం నమ్ముకుని అడుగు వేస్తే అంతా మంచే జరుగుతుంది. విజయాన్ని ఒక ప్రాణంలా తీసుకుని పోరాడితే తప్పక విజయం మీకే దక్కుతుంది. జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృదా చేసుకోకండి. లెగండి... సరైంది వారిని ఎంచుకుని విజయం వైపు పరుగులు తీయండి. మీరు దిగులు లేదా బాధ పడే ప్రతి ఒక్క క్షణం విజయానికి దూరం అవుతున్నారని గుర్తించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: