విజయం మీదే: కష్టపడినా ఫలితం శూన్యమా?
అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన అర్దం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే మొదటగా మీ ప్రయత్నం ఎందుకు? మీ లక్ష్యం ఏమిటి? అన్న దానిపై క్లియర్ గా ఉండండి. అలా కాకుండా పరిస్థితులను బట్టి మార్చుకుంటూ పోతే ఎందులోనూ విజయాన్ని అందుకోలేము. ఇంకొందరికి విచిత్రమైన అనుమానాలు వస్తుంటాయి. నిజానికి చెప్పాలంటే అవి ఒక రకంగా వాస్తవమైనవే ఇంతకీ అవి ఏమిటంటే. ఒక మంచి ఉద్యోగి చేసే శ్రమ కన్నా, ఒక సాధారణ కూలి చేసే కష్టమే ఎక్కువ. ఉద్యోగితో పోలిస్తే కూలిదే ఎక్కువ శ్రమ, కష్టం. కానీ గుర్తింపు అలాగే ఆర్ధిక ఫలితం మాత్రం ఉద్యోగికే.
అయితే అంతగా కష్టపడుతున్న కూలీకే కదా ఎక్కువ ప్రాముఖ్యత దక్కాలి, అయితే అంతా కూడా అదృష్టం ఉండాలి అని అంటుంటారు. నిజమే రాసిపెట్టుండాలి , అయితే అందుకు తగ్గ ప్రయత్నం కూడా ఉండాలి, అనుకున్న మార్గంలో చివరి వరకు పయనించాలి. చిన్నప్పటి నుండి కష్టపడి చదువుకుంటే ఆ తరవాత ఆ చదువు మనకు పెద్దగా కష్టం లేకుండా ఫలితాన్ని ఇచ్చేందుకు చాలా వరకు ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఏ కారణం చేతనైనా పక్కన పెడితే, అదృష్టం కూడా కలసి రాక కష్టాలు తప్పవు.