విజయం మీదే: విజయానికి ఈ సాధనాలు కీలకం...
లక్ష్యాన్ని చేధించాలి అంటే కష్ట పడాలి అలాగే అందుకు తగ్గట్టుగా మన గమనం ఉండాలి. అయితే విజయాన్ని అందుకోవాలి అంటే అందుకు కొన్ని సాధనాలు అవసరం. అవేంటో ఇపుడు తెలుసుకుందాం.
లక్ష్యాన్ని ఎంపిక చేసుకునే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. మన ఆలోచనలే మన నిర్ణయాలను నిర్ణయిస్తాయి... ఆలోచనలే ఆయుధాలుగా మారుతాయి.
మీ ప్రతి ఆలోచన మీరు విజయాన్ని అందుకోవడానికి ఒక మెట్టు కావాలే తప్పా... మిమ్మల్ని వెనక్కి లాగే అవకాశం కాకుండా జాగ్రత్త పడాలి. అందుకే ఆలోచన విధానం చాలా ప్రదానం.
లక్ష్యాన్ని ఎంపిక చేసుకున్న తరవాత వెను తిరిగి చూడకూడదు. కష్టమైనా నష్టమైనా పయనాన్ని ఆపరాదు. అవరోధాలు కలిగినపుడు వాటిని ఎదుర్కోవడానికి కావలసిన సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలి. వాటిని ఆపడానికి
ప్రయత్నం జరగాలి.
మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి, మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. అలాగని నిరుత్సాహ పడకుండా ముందుకు సాగండి. మనకు అసాధ్యం అనుకుంటే అక్కడే ఆగిపోతాము, ప్రయత్నం అనేది జరిగినప్పుడే దేన్ని అయినా సాధ్యం చేసి చూపగలం.
పైన తెలిపిన విషయాలన్నీ గుర్తుంచుకుని మీ లక్ష్య సాధనలో వాడుకుంటూ అనుకున్నది సాధించి సమాజంలో మీకంటూ ఒక గుర్తిపును సంపాదించుకోండి.