విజయం మీదే: ప్రాణం పోయేలోగా... సాధించి చూపెట్టు
మనిషి పుట్టుకకు మరణానికి మధ్య ఉండే సమయమే జీవితం. ఈ జీవన ప్రయాణంలో కొన్ని మన నిర్ణయానికి అనుగుణంగా ఉంటాయి. మరికొన్నిటిని మనకు నచ్చినా, నచ్చక పోయినా ఆహ్వానించాల్సి వుంటుంది. మనిషి జీవితం భూమిపై జీవించేంత కాలమే. ప్రాణం ఉన్నంత వరకే. అందుకే ఈ సమయం చాలా విలువైనది. ఉదాహరణకు ఒక వ్యక్తి తన తల్లికి హార్ట్ స్ట్రోక్ రావడంతో ఎన్ని కోట్లు అయినా పర్వాలేదు ఖర్చు చేస్తాను, ఎలాగైనా మా అమ్మ ప్రాణం మాత్రం నిలబెట్టిండి అని డాక్టర్లను ఎంత ప్రాదేయపడినా, కొన్ని సార్లు ఉపయోగం ఉండక పోవచ్చు. ఎందుకంటే డబ్బు ప్రాణాన్ని వెనక్కు తీసుకురాలేదు.
అందుకే ఎప్పుడు కూడా డాక్టర్స్ ఒకటే చెబుతారు మా ప్రయత్నం మేము చేస్తాం తర్వాత దేవుడి నిర్ణయం అని, అందుకే ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి. ప్రాణాన్ని డబ్బు తోనో మరే ఇతర వస్తువు తోనో కొనలేము. అందుకే జీవితంలో ఏమి సాధించాలి అన్నా ఈ లోపు మాత్రమే సాధించాలి. కాబట్టి ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని పెట్టుకుని దానిపై కష్ట పడండి.