విజయం మీదే: మన "ఇంటి బాధ్యత" కూడా ఒక లక్ష్యమే?
కానీ అందరూ అనుకున్న విధంగా తమ కుటుంబాన్ని నదిపించలేకపోవచ్చు. కొందరు ఇందులో సఫలం కాగా మరి కొందరు జీవితం ఎటు పోతే అటుగా పయణించక తప్పదు అన్నట్లుగా సాగుతుంటారు, కొందరు తప్పక కాలంతో సర్దుకుపోతుంటారు. అయితే ఎవరైతే అన్నిటినీ ఒక ప్రణాళిక ప్రకారం చక్కబెట్టుకుంటూ వస్తుంటారో అలాంటి వారికి కాలం కూడా సహకరిస్తుంది. కాక పోతే వేసుకున్న ప్రతి ప్రణాళిక అనుకున్నట్లుగా జరగక పోవచ్చు. కానీ ప్రణాళిక ఉండటం మంచిదే అలా ప్రణాళిక ఉండటం వలన అనుకున్నది సాధించాలనే తపన నిరంతరం కొనసాగుతుంది, నిత్యం మనకు మన లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది.
అపుడే తమ కుటుంబం కోసం తాము ఎంత కష్టమైనా, నష్టమైనా భరించి పయనాన్ని సంతోషంగా కొనసాగిస్తారు. నిజానికి తల్లితండ్రులు ఎప్పుడూ కూడా తమ కుటుంబానికి సంబంధించిన ప్రతి సమస్యను భారంగా అనుకోరు, ఎంత కష్టమైనా దాన్ని చేదించాలనే చూస్తారు. అందులోనూ అది తమ పిల్లలకు సంబందించిన విషయం అయితే మరింత అలెర్ట్ గా ఉండి త్వరగా ఆ సమస్యను పరిష్కరించేందుకు శతవిధాల ప్రయత్నిస్తారు. ఇలా తమ ఇంటి బాధ్యతలు సక్రమంగా చక్కదిద్దడం అంటే అది గొప్ప విజయంతో సమానమే.