విజయం మీదే: విజయానికి 4 సూత్రాలు ఇవే?
సరైన లక్ష్యం
సరైన లక్ష్యాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. లక్ష్యాన్ని ఎంచుకునే సమయంలో ఒకటికి పది సార్లు ఆలోచించాలి. అత్యాశ అనే పదం గుర్తు ఉండే వుంటుంది. మన సామర్ధ్యానికి మించిన లక్ష్యం ఎంచుకోవడం అంటే చాలా వరకు పొరపాటు అవుతుంది. అది మన సామర్ధ్యానికి అనుగుణంగా ఉండాలి. లేదా ఇంకొంచం ఎక్కువైనా మరింత కష్టపడితే సాదించేదిగా ఉండాలి.
దిశ
ఎంచుకున్న లక్ష్యం యొక్క దిశను నిర్ణయించుకోవాలి, ఆటుపోట్లు అడ్డంకులు ఎదురైనా దిశను మార్చుకోకుండా లక్ష్యం వైపుగా ముందుకు సాగాలి.
నిర్ణయం
మీరు తీసుకునే నిర్ణయాలు మీ జయాపజయాలను ప్రభావితం చేస్తాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కాస్త ముందు వెనక ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మన విజయానికి ఆటంకాలు కాకూడదు. ఏదైనా డిసైడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బాగా ఆలోచించండి, మీ అనుభవాలను పరిగణలోకి తీసుకుని , ముందు చూపుతో నిర్ణయం తీసుకోండి.
ప్రణాళిక
చాలాసార్లు ఈ పదం వింటూనే ఉంటాము. ప్రణాళిక అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి. ఏ పని అయినా పూర్తి చేయాలి అంటే అందుకోసం ముందుగా ఒక ప్రణాళిక అవసరం. ప్రణాళిక లేకపోయినప్పటికీ చేయవచ్చును. కానీ ప్రణాళిక ఉండటానికి లేకపోవడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఎటు పడితే అటు పోవడం కన్నా మార్గాన్ని ఎంపిక చేసుకుని పతనాన్ని నిర్ణయించుకోవడం ఉత్తమం.