విజయం మీదే: మీరెటువైపు... ఉద్యోగమా... వ్యాపారమా?

VAMSI
కొందరికి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగి అన్ని సౌకర్యాలతో జీవించడమే లక్ష్యంగా ఉంటుంది. మరి అందుకు మార్గం ఏమిటి ? ఉద్యోగమా ? లేక వ్యాపారమా అన్న ప్రశ్న తలెత్తితే ఎక్కువ మంది చెప్పే సమాధానం ఉద్యోగం. ఎందుకంటే ఇక్కడ రిస్క్ తక్కువ. చదువు, ప్రతిభ ఉంటే చాలు స్థాయికి తగ్గట్లు ఉద్యోగం వస్తుంది. ఇక్కడ పెట్టుబడి అవసరం లేదు, నష్టం గురించిన భయమే లేదు, లైఫ్ కి మినిమం గ్యారంటీ అనే చెప్పాలి , అందుకే ఎక్కువ మంది ఉద్యోగం అనే చెబుతారు. అదే వ్యాపార రంగంలో అయితే నష్ట భయం ఎక్కువ, చాలా బిజీ లైఫ్, ఒత్తిడి ఎక్కువ, గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితులు అందుకే చాలా మంది వ్యాపారానికి దూరంగా ఉంటారు, రిస్క్ చేయాలని అనుకోరు. కానీ వాస్తవం చూస్తే... నిపుణులు ఏమి చెబుతున్నారు అంటే,
100%  మంది ప్రజలు అయితే ఇందులో 80 % మంది ఉద్యోగాల బాట పడుతున్నారు. 20% మంది మాత్రమే వేరే రంగాల వైపు అడుగులు వేస్తున్నారు. కాగా ఆస్తుల విషయానికి వస్తే 100 ఇళ్ళల్లో 80 ఇల్లుకు పైగా వ్యాపారస్తుల ఇల్లు ఉన్నాయి. 20 ఇల్లులు మాత్రమే ఉద్యోగస్తుల ఇళ్లులు ఉంటున్నాయి. అంటే ఇక్కడ అర్దం చేసుకోవాల్సింది ఏమిటంటే వ్యాపారం రిస్క్ తో కూడుకున్న అంశం అయినప్పటికీ ఎదుగుదల ఎక్కువగా త్వరగా ఉండే అవకాశం కలిగి ఉన్నది. చక్కటి  ప్రమాణాలతో, ముందు జాగ్రత్త ఆలోచనతో అడుగులు వేస్తే ఇక్కడ సక్సెస్ సాధించడం పెద్ద కష్టమైన విషయం కాదు.
కాబట్టి మీ లక్ష్యానికి ఎంచుకునే మార్గం లేదన్నది జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని ముందుకు సాగండి. ముందు చూపుతో నిర్ధారితమైన ఎటువంటి పద్ధతులను పాటించగలిగితే వ్యాపారంలో తప్పక ఉన్నతి సాధిస్తారు. కనుక ఇక్కడ నిపుణులు చెబుతున్నది ఏమిటి అంటే మనిషి అనతి కాలం లోనే విపరీతంగా ఎదగడానికి వ్యాపార రంగంలో ఒక చక్కటి సోర్స్ అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: