కావాల్సిన పదార్థాలు :
బంగాళాదుంపలు : 2
పనీర్ : రెండొందల గ్రాములు
కొత్తిమీర : కట్ట
పచ్చిమిర్చి ముద్ద : రెండు చెంచాలు పచ్చి
బఠాణీలు : వంద గ్రాములు,
గరం మసాలా : చెంచా
ఉప్పు : రుచికి తగినంత
నూనె : కొద్దిగా
తయారు చేయు విధానం :
ముందుగా బంగాళాదుంపలు, పచ్చిబఠాణీలు విడివిడిగా కుక్కర్‌లో మూడు కూతలు వచ్చే వరకూ ఉడికించాలి. పనీర్ తురిమి కొద్దిగా నెయ్యి రాసి బాణిలిలో వేయించుకోవాలి. ఇంతలో చల్లారిన బంగాళాదుంపల పొట్టు తీసి చేత్తో మెత్తగా మెదుపుకోవాలి. ఈ ముద్దని చెంచా నూనెలో పచ్చివాసన పోయే వరకూ వేయించుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో బంగాళాదుంప మిశ్రమం, వేయించిన పనీర్, ఉడికించిన బఠాణీలు, కొత్తిమీర తరుగు, గరం మసాలా, పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు వేసి బాగా కలియతిప్పాలి. పావుగంట పక్కన పెట్టి టిక్కాలా చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద పెనం పెట్టి వేడయ్యాక టిక్కాను నూనెతో రెండు వైపులా దోరగా వేయించుకోవాలి.
వీటిని టమాటాసాస్‌తో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: