బఠాణీ, మష్రుమ్ మొగలాయ్ కర్రీ

Durga
తయారీ చేయడంలో వాడే పధార్థాలు : బటన్ మష్రూమ్స్ : 10 గ్రాముల  గ్రీన్ఫీస్: 50 గ్రాములు టొమోటో:1 (పెద్దది) జీడిపప్పు :25 గ్రాములు కిస్మిస్ :1/2 చెంచా. బాదం పప్పు :25 గ్రాములు దనియాలపొడి :1/2 జిలకర్ర:1/4 చెంచా  గరంమసాల :1/4  చెంచా ఇంగువ :చిటికెడు  కొత్తిమీర : కొంచెం  నిమ్మకాయ :1  క్రీం : 1/2కప్పు  ఉప్పు :సరిపడ  కారం :1/2 చెంచా  పసుపు : కొంచెం  నూనె : 2 చెంచాలు.  తయారీ చేయువిధానం : 1)ముందుగా మష్రూమ్స్ ను ఫోర్క్ లేదా పిన్ తో పీకి వాటికి నిమ్మరసం కొంచెం ఉప్పు పట్టించి ప్రక్కన ఉంచాలి. 2)బాండీ పొయ్యి మీద నూనెవేసి కాగిన తరువాత ఇంగువ, జీలకర్ర, కారం, పసుపు, ధనియాలపొడి, గరంమసాలా, ఉప్పు వేసి 1 నిమిషం వేపాలి. 3) వీటిలో టొమోటా సన్నని ముక్కలు వేసి కలుపుతూ మూడు నిమిషాలు వేపాలి. 4) తరువాత మష్రూం, గ్రీన్ పీస్ వేసి 5 నిమిషాల సేపు సన్నని మంట మీద గరిటితోకలుపుతూ వేపాలి. 5) ఒక కప్పు నీరు పోసి మూతపెట్టి పదినిమిషాలు ఉడికించాలి. 6) ఉడికిన తరువాత కొత్తిమీర వేసిన బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసి కలిపి గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు ఉంచి దానికి క్రీం కలిపి దించాలి. 7)కర్రీని సర్వింగ్ డిష్ లోకి తీసి పరోట, నాన్లలోకి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: