చిన్నపిల్లలకు రాగి జావతో చేసిన ఆహారం ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది

Durga
ఇందుకు కావాలిసినవి : వేపిన రాగులు :150 గ్రా. వేపిన పెసరపప్పు : 40 గ్రా. వేపి పొట్టుతీసిన వేరుశనగలు :20 గ్రా.  వేపిన నువ్వులు : 10 గ్రా. బెల్లం : 60 గ్రా. తయారు చేయువిధానం : ముందుగా రాగులను ఒక రోజు రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. ఉదయం వాటిని కడిగి నీరంతా వొంపి వాటిని ప్టేట్లో పోసి వాటి మీద తడగుడ్డ కప్పాలి. ఇలా చేయటం వల్ల నానిన రాగులు మొలకెత్తుతాయి.  తరువాత మొలకెత్తిన రాగులను పేపర్ లేదా పళ్లెంలో పలచగా పరిచి ఎండబెట్టాలి. ఎండగట్టిన రాగులను ఖాళీ బాండీలో సన్నని మంటమీద చక్కటి కమ్మని వాసన వచ్చేవరకు వేపాలి. వేగిన వీటిని చల్లార్చి మెత్తగా పిండి తయారుచేసుకోవాలి. తరువాత వేపిన పెసరపప్పు వేరుశనగలు, నువ్వులు, కూడా విడివిడిగా మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. వీటిని అన్నింటిని రాగుల పిండికి జతచేసి బాగా కలిపి శుభ్రంగా కడిగి బాగా ఆరిన డబ్బాలో పోసి నిల్వ ఉంచుకోవాలి. బిడ్డకు పెట్టాడానికి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు పిండిని బౌల్లో వేయాలి. తరువాత కాచి చల్లార్చిన గోరు వెచ్చని నీటిని సరిపడ పోసి ఫేస్టులాగా చేసి తినిపించాలి. పిల్లలకు దాదాపుగా పంచదార కన్నా బెల్లం ఎక్కువగా వాడాలి. రాగులు చవక అయినా వాటిలో కాల్షీయం సమృద్దిగా ఉండి పసిపిల్లల ఎముకలు, దాంతాల పెరుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: