పొటాటో స్ట్యూ
తయారు చేయువిధానం : ఉల్లిపాయలు సన్నగా తరగాలి. అల్లం, పచ్చిమిర్చి, మిక్సీ చేసి ఉంచాలి. బంగాళదుంపలు ఉడికించి వాటిని ముక్కలుగా చేసి కొబ్బరి తురిమి మిక్సీకి వేసి కొబ్బరిపాలు మూడు సార్లుగా తీసివుంచాలి.
పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయలు వేయించి, అల్లం మిర్చి ముద్ద కూడా వేసి వేయించాలి. కొబ్బరిపాలు పాన్లో వేస్తూ బంగాళాదుంపలు ముక్కలు వేసుకుని ఉప్పు వేయాలి. అది ఉడికినప్పడు కరేవాకు, కొత్తిమీరతో గార్నింగ్ చేయాలి. ఈ కూరని పూరిలలోకి , రోటీలోకి బాగుంటుంది.