పెళ్లి కూతురు మీద పెళ్లి కొడుకు కేసు .. కారణం తెలిస్తే నవ్వుతారు :
ముహూర్తం దాటి పోతున్నా కూడా మండపానికి రాలేదు ఆ వధువు, ఆమె మీద వరుడు ఫిర్యాదు చేసిన సంఘటన ముంబై లో జరిగింది. ముంబై కి చెందిన శ్రీకాంత్ కంబ్లె కి పూజా అనే అమ్మాయి తో పెళ్లి ఫిక్స్ చేసారు పెద్దవాళ్ళు. వివాహం కి మొత్తం తానే సిద్దం చేసుకున్నాడు, కొద్ది రోజుల ముందర బంగారం దగ్గర నుంచీ అన్నీ తానే ఏర్పాటు చేసుకున్నాడు.
పెద్దవారి మాట విని ఆ పిల్లతో జీవితం బతకడం కోసం అతను పెళ్లి మండపం బుక్ చేసుకుని పెద్ద ఎత్తున చుట్టాలని పిలిపించుకుని అంతా ఓకే చేసుకున్నాడు. తీరా పెళ్లి మండపం లో కూర్చుకుని తాళి కట్టే టైం లో పెళ్లి కూతురు అసలు మండపానికే రాలేదు. దీంతో అతనికి ఒళ్ళు మండింది. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
వివాహం చేసుకుంటానని మోసం చేసిందని ఆరోపించాడు. వివాహం చేసుకుంటానని చెప్పడంతో తాను 2 లక్షల రూపాయలు ఖర్చు చేసి, ఏర్పాట్లు చేశానని, తన డబ్బులు తనకు ఇప్పించాలని డిమాండ్ చేశాడు. పోలీసులు కబురంపడంతో మరుసటి రోజు అదే పోలీస్ స్టేషన్ కు తన ప్రియుడితో కలిసి చేరుకున్న వధువు... తన తల్లిదండ్రులు బలవంతంగా తన వివాహం శ్రీకాంత్ తో నిశ్చయించారని, అది నచ్చక పెళ్లి రోజు పారిపోయానని తెలిపింది.