కావాల్సిన పదార్ధాలు
చికెన్ 700 గ్రా.
సాల్ట్ 1 స్పూన్
వెల్లుల్లి రెబ్బలు 3
నూనె 2 స్పూన్లు
ధనియాల పొడి రెండు స్పూన్లు
కారంపొడి 1స్పూన్
పసుపు చిటికెడు
నిమ్మకాయ రసం 4స్పూన్లు
తరిగిన కొత్తమీర 2 స్పూన్లు
తయారు చేసే విధానం
చికెన్ ని బాగా కడిగి, తడి లేకుండా తుడిచి పొడిగా ఆరబెట్టాలి. చిన్నముక్కలుగా తరగాలి. ఉప్పు, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా కలపాలి.
నాన్ స్టిక్ పాన్ లో నూనె వేసి ఈ ముక్కలను వేసి వేయించాలి. చికెన్ ను వేసి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, పసుపు, కారం వేసి బాగా కలపాలి. బాగా మెత్తబడేవరకూ వేయిస్తూ ఉండాలి. నిమ్మరసం, కొత్తిమీర ఆకులు పైన వేయాలి. ఈ చాట్ లో ఉల్లిపాయ చక్రాలు, నిమ్మముక్కలు కుకుంబర్ పీసెస్ తో అలంకరించాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: