డెవిల్ చికెన్

Durga
 కావలసిన వస్తువులు : కోడిమాంసం : అరకిలో ఎండుమిర్చి : ఆరు వెనిగర్ : ఒక స్పూన్ మిరియాలు : అర స్పూన్ పసుపు : కొంచెం గరంమసాలా : అర స్పూన్ చింతపండు : 25 గ్రాములు ఉల్లిపాయలు : 100 గ్రాములు అల్లం : చిన్నముక్క కొబ్బరిపాలు : రెండు కప్పులు నూనె : 100 గ్రాములు ఉప్పు : సరిపడా తయారీ చేయువిధానం : చికెన్ జాయింట్ ముక్కలను శుభ్రం చేసి ఉంచుకోండి. దీనికి తగినంత ఉప్పు- వెనిగర్, పొడిగా దంచుకున్న ఎండుమిర్చి, మిరియాలు, గరంమసాలా పట్టించి గంటసేపు వూరబెబ్టండి. బాణలీలో నూనెవేసి బాగా కాగాక ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించండి. పసుపు అల్లం, వెల్లుల్లి వేసి కాసేపు వేయించండి.  ఊరబెట్టిన చికెన్ ముక్కలను వేసి బాగా కలిపి చిన్న మంటమీద ఉడకపెట్టాలి. బాగా ఇగిరిన తరవాత కొబ్బరిపాలు పోసి పూర్తిగా మరిగిన తర్వాత చింతపండు గుజ్జును కలపండి. పావుగంట పొయ్యిమీద వుంచితే డెవిల్ చికెన్ రెడీ...  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: