గోంగూర - పులిహోర

Durga
పులిహోర గోంగూర తయారీకి కావలసినవి : గోంగూర : 1 కె.జి చింతపండు : 75 గ్రాములు కారం : 100 గ్రా, లు ఉప్పు : తగినంత పచ్చిశనగపప్పు : 2 చెంచాలు పసుపు : 1 చెంచా ఆవాలు : 2 చెంచాలు ఇంగువ : కొద్దిగా నూనె : 100 గ్రాములు తయారీ చేయువిధానం : గోంగూరని శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. చింతపండుని వేడి నీళ్లలో ఒక గంట నానపెట్టాలి. నూనె కాచి గోంగూరకి ఉప్పు, కారం వేసి మెత్తగా రుబ్బి వుంచుకోవాలి. చింతపండు పిసికి చిక్కగా పుసులు తీయాలి. కళాయిలో పోసిన నూనె బాగా కాగిన తరువాత దానిలో పచ్చిశనగపప్పు, ఆవాలు, వేయించి అందులో చింతపండు పులుసు పోసి కాస్త పసుపు వలిపి స్టౌ మీద ఉడకబెట్టాలి. గుజ్జుగా ఉడికిన తరువాత ఇంగువ వేసి రుబ్బుకున్న గోంగూరలో కలపాలి. చల్లారిన తరువాత జాడీలో పెట్టుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: