గుత్తి వంకాయ కూర స్పెషల్

Durga
కావలసిన పదార్థాలు: తాజా నల్లని చిన్న సైజు వంకాయలు - 1/2 kg ఉల్లిపాయలు - 1/4 kg టమోటాలు - 1/4 kg మిరప పొడి ధనియాల పొడి ఆవాలు - 1/2 tsp  ఉప్పు - 2 tsp పసుపు - చిటికెడు కొబ్బరి: అరచిప్ప అల్లం - 2 కొద్దిగా నూనె - 2 tsp పచ్చి మిర్చి - 10 nos నువ్వులు - 25 grm కొత్తిమీర- తగినంత తయరుచేయు విధానం: ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకొవాలి. ఉల్లిపాయలు, టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. వంకాయల్ని అడ్డంగా నిలువుగా గాట్లు పెట్టాలి. ఇప్పుడు నువ్వులు ఒక పాన్ లో వేయించుకోవాలి. దోరగా వేగాక వాటిని మిక్సీలొ పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి. ధనియాలు పొడి, మిరప పొడి, పసుపు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, నీరుల్లి అన్ని గ్రైడ్ చేసి వుంచుకోవాలి. ఈ మసాలా ముద్దకు ఉప్పు, కొద్దిగా నూనే వేసి కట్ చేసి వుంచిన వంకాయల్లో కూర్చాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నే తీసుకుని పొయ్యి మీద పెట్టి నూనె పొయ్యాలి. నూనె కాగాక పోపు పెట్టి ఉల్లిపాయ, టమోటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సన్నని సెగ మీద ఉడకనివ్వాలి. ఆ ముక్కలు బాగా పేస్టులాగా ఉడకాలి. ఇప్పుడు ఆ గిన్నెలొ ఒక లీటరు నీరు పోసి వంకాయలు ఉడికి బాగా మగ్గనివ్వాలి, నీళ్ళు సగం అయ్యే దాకా ఉడికించాలి. ఇప్పుడు పక్కన పెట్టిన నువ్వుల పొడిని గిన్నెలో వేసి అడుగు అంటకుండా కలియతిప్పి 2 నిముషాలు ఉంచి కొత్తిమీర చల్లి దించుకొవాలి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కలుపుకుని తినవచ్చును.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: