'సారాయి' వల్ల 'కసాయి' లా మారిన కన్న తండ్రి..

Suma Kallamadi

 

   సవ్య సమాజం తలదింన్చుకునే ఘటన. నాన్న అన్న మాటలకు అర్ధాలే వేరు. చిన్న వయసులో వేలు పట్టుకుని నడిపించే మన నీడ నాన్న. పెద్దయ్యాక మంచి, చెడు   చెప్పి మనల్ని మంచి మార్గంలో నడిపే ఫ్రెండ్  మరియు గురువు నాన్న.

 

          ఆడపిల్లకి పెళ్లి అయ్యాక కూడా పుట్టింటి మీద ఉన్న అనురాగం ఎంతో అనేది ఇప్పటికీ తెలిసిందే. అలాంటి కూతుర్ని తాగిన మత్తులో ఏమి చేస్తున్నాడో తెలియని స్థితిలో కూతురిపై కామ వాంఛ తీర్చుకోవాలను కున్నాడు ఓ  కసాయి తండ్రి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

 

          జీడిమెట్ల రంగా రెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్ సమీప కాలనీ లో ఒక వ్యక్తి(40) భార్య, కుమార్తెతో కలిసి నివాసముంటున్నాడు. పదిహేను రోజుల కిందటి అతడి భార్య అనారోగ్యం పాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. దీంతో వారి ఇంట్లో కుమార్తె ఒంటరిగా ఉంటుంది. నాలుగు రోజుల క్రితం మద్యం తాగి ఇంటికి వచ్చిన వ్యక్తి  కూతురు అన్న కనికరం కూడా లేకుండా అభంశుభం తెలియని తన చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇంట్లో ఒకటే ఉండటంతో భయపడి అరవటం మొదలు పెట్టింది. ఏమి చేయాలో తెలియని పరిస్థితి, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోలేని స్థితిలో అరుచుకుంటూ పరుగులు తీసి బయటకు వచ్చి తన స్నేహితురాలికి చెప్పింది. 

 

       తన స్నేహితురాలు తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పగా వారు ఆ చిన్నారిని పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన తండ్రి తనపై అత్యాచారం చేశాడని చెప్పడంతో వారు  చుట్టుపక్కల వారిని పిలిచి ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి ఉంచారు.  తండ్రి అనే పదానికి విలువ లేకుండా చేశాడు ఈ కసాయి తండ్రి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: