సండే స్పెషల్ `పెప్పర్ ఫిష్ ఫ్రై`
కావాల్సిన పదార్ధాలు:
పిఫ్ ముక్కలు- ఆరు
మిరియాలు- రెండు స్పూన్లు
ధనియాల పొడి- అర టీ స్పూన్
కారం- ఒక స్పూన్
పసుపు- అర టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు- కొద్దిగా
నూనె- ఐదు స్పూన్లు
కొత్తిమీర- కొద్దిగా
ఉప్పు- రుచికి సరిపడా
తయారీ విధానం:
ముందుగా ఫిష్ ముక్కలును శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. తరువాత మిక్సీ జార్ లో మిరియాలు, వెల్లుల్లి తీసుకొని మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్టుని పొడి మసాలాలో వేసి కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి. ఈ మసాలా ముద్దను చేప ముక్కలకు బాగా పట్టించి, అరగంట సేపు పక్కన పెట్టాలి.
ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ తీసుకొని స్టౌ మీద పెట్టి దానిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కాక చేప ముక్కలు వేసి సన్నని మంట మీద ఫ్రై చేయాలి. పది నిమిషాలు వేపిన తరువాత చేప ముక్కలను రెండవ వైపుకు తిప్పి వేపాలి. రెండు వైపులా బాగా వేగిన తరువాత ముక్కలను ఒక ప్లేట్ లోకి తీసుకొని తరిగిన కొత్తిమీర చల్లితే సరిపోతుంది. అంతే నోరూరించే వేడి వేడి ఫిష్ ఫ్రై రెడీ. తప్పకుండా ట్రై చేయండి..!