కొన్ని ఘటనలు జరిగిన తర్వాత అందరూ అలర్టవుతారు. నియమ నిబంధనలు ఉన్న పాటించటంలో నిర్లక్ష్యం వహిస్తారు. అయితే ఘోరమైన ఘటనల తర్వాత నిర్లక్ష్యాన్ని వదిలించుకుంటారనే విషయం ఈమధ్యే జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యతో తాజాగా రుజువైంది. తెలంగాణా పోలీసులు నిర్వాకం బయటపడటంతో ఏపి పోలీసులు ముందుజాగ్రత్తగా అలర్టయిపోయారు. ’జీరో ఎఫ్ఐఆర్’ విషయం గురించే ఇదంతా చెప్పుకుంటున్నాం.
జీరో ఎఫ్ఐఆర్ విషయంపై తెలంగాణాతో పాటు సాక్ష్యాత్తు పార్లమెంటులో కూడా పెద్ద స్ధాయిలో చర్చ జరిగింది. దాంతో ఇపుడు జీరో ఎఫ్ఐఆర్ పైనే అందరూ చర్చించుకుంటున్నారు. జీరో ఎఫ్ఐఆర్ అంటే బాధితులు ఎవరైనా పోలీసు స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేస్తే వెంటనే అంటే ఘటన జరిగిన ప్రాంతంతో సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయటాన్నే జీరో ఎఫ్ఐఆర్ అంటారు. మామూలుగా ఎవరు ఫిర్యాదు చేయటానికి వచ్చినా ఘటన ఎక్కడ జరిగిందనే విషయంలో పోలీసులు ఆరా తీస్తారు. తర్వాత ఘటన జరిగిన ప్రాంతం తమ పోలీసుస్టేషన్ పరిధిలోకి రాదని చెప్పి పంపేస్తారు.
అయితే ఘటన జరిగిన ప్రాంతం ఏ పోలీసుస్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలుసుకునే లోపే పుణ్యకాలం గడిచిపోతుంది. ఇది మామూలుగా జరిగే తంతే. మొన్న దిశ హత్యాచారం ఘటనలో కూడా ఇదే జరిగింది. కూతురు మిస్సింగ్ పై ఫిర్యాదు చేయటానికి వస్తే ఘటన జరిగింది తమ పరిధిలో కాదని శంషాబాద్ పోలీసులు శంషాబాద్ రూరల్ పోలీసుస్టేషన్ కు పంపేశారు. అక్కడకెళ్ళి మళ్ళీ ఫిర్యాదు చేసేసమయానికి జరగరాని ఘోరం జరిగిపోయింది. అదే శంషాబాద్ పోలీసులే ముందు కేసు రిజిస్టర్ చేసుకుని వెంటనే శంషాబాద్ రూరల్ పోలీసులను అలర్ట్ చేసుంటే పరిస్ధితి ఇంకో విధంగా ఉండేదేమో.
నిజానికి బాధితుల నుండి ఫిర్యాదు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి తర్వాత సంబంధింత పోలీసుస్టేషన్ కు ఎఫ్ఐఆర్ ను బదిలి చేయమని సుప్రింకోర్టు ఎప్పుడో చెప్పింది. అయితే ఏ పోలీసుస్టేషన్లోను ఆ పని చేయటం లేదు. బాధితులు కూడా పట్టించుకోవటం లేదు. కానీ దిశ హత్య ఘటనలో కూడా పోలీసులు ఇలాగే వ్యవహరించార్న విషయం బయటపడటంతో సంచలనంగా మారింది. అందుకనే జీరో ఎఫ్ఐఆర్ పద్దతిని ఫాలో అవ్వాల్సిందిగా ఏపి డిజిపి గౌతమ్ సవాంగ్ తాజగా అందరికీ ఆదేశాలిచ్చారు. ఆదేశాలను పాటించని వాళ్ళపై కఠినచర్యలుంటాయని హెచ్చరించారు. చూద్దాం క్రిందిస్ధాయి పోలీసులేం చేస్తారో ?
మరింత సమాచారం తెలుసుకోండి: