అబార్షన్ చేసుకోవడం నేరం అందుకే ఈ ఘోరాలు చేస్తున్నారు.

Mallikarjun

ఈ కాలం ఇంట్లో భార్య భర్త ఇద్దరు పనిచేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి కొందరిదైతే, ఇష్టం తో చేసేవాళ్ళు కొంతమంది  పని భారం , ప్రయాణాలు  మొదలగునవి వారి సంసారంపైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి అలాగే కొంతమంది భార్య భర్తలది ఒకరిది పగటి పూట జాబ్ అయితే ఒకరిది రాత్రిపూట జాబ్ ఇలా సంసార జీవితానికి దూరం అవుతున్నారు. మరికొందరి పరిస్థితి మాత్రం ఇద్దరు కలిసి ఉన్న పిల్లలు లేక టెస్ట్ లకు అని సంతాన సాఫల్య కేంద్రాలకాని తిరుగుతూ బాధపడేవారు కొందరు.

ఇక్కడ అందరి కోరిక ఒకటే  సుఖఃమైనా జీవితం తో పిల్లాపాపలతో  జీవితం గడిచిపోవడం. అయితే ఇక్కడ సీను రివర్స్ అయింది పిల్లలను   కనడం ఇష్టంలేని తల్లులు చేస్తున్న ఈ దురాగతం గురించి తెలిస్తే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. పసిబిడ్డ పుట్టగానే తల్లి పాలు ఇచ్చి ప్రాణం పోయాల్సిన తల్లులు కొన్నిరకాల పానీయాలను తాగించి  పసి పిల్లల ప్రాణాలను తీస్తున్నారు. ఈ ఉదంతం మనదేశం లో కంటే విదేశాలలోనే ఎక్కువ  ఇక విషయానికి వస్తే  కెన్యాలో  బార్యభర్తలు పిల్లలు అవసరం లేదని గాని లేదా యువకులు తొందరపడి అబార్షన్లు చేయించుకోవడాన్ని నేరంగా పరిగణిస్తున్నారు. దీంతో అక్కడి మహిళలు  ఎటు తోచని పరిస్థితులలో ప్రత్యామ్నయ మార్గాలను ఎంచుకుంటున్నారు. పసిబిడ్డ పుట్టగానే పిల్లలకు తల్లి పాలు కాకుండా  అనవసరమైన  పానీయాలు తాగిస్తున్నారు.

వాటి వల్ల పిల్లల్లోని అవయవాలు దెబ్బతిని క్షణాల్లో కన్ను మూస్తున్నారు. పిల్లలు చనిపోయారని నిర్ధరించుకున్న తర్వాత ఆ చనిపోయిన పిల్లలను  చెత్తకుప్పలు, నదులు, లేదా కాలువల్లో పడేస్తున్నారు. కెన్యాలో పేదరికం వల్ల పిల్లలను పోషించలేని పరిస్థితులు ఉన్నాయని, పొరపాటున గర్భం దాల్చితే అబార్షన్ చేయించుకోలేని పరిస్థితుల్లో ఈ ఘోరాలకు పాల్పడుతున్నారని  ఆ ప్రాంతానికి చెందిన ఓ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. ఆ సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ కొంతమంది మహిళలకు పిల్లలను పోషించగలిగే స్తోమత ఉండదు. దీంతో వారు బిడ్డ పుట్టగానే తల్లిపాలు  ఇవ్వకుండా హానికరమైన పానీయాలు తమ  బిడ్డ ప్రాణాలు తీస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు.   నదిలో చెత్తను తొలగిస్తున్న సమయంలో కొన్ని శిశు కళేబారాలు కనిపించాయి. కేవలం వారం రోజుల్లోనే ఎనిమిది కళేబారాలను నదిలో నుంచి తీశారు. దీనిబట్టి చూస్తే  ఏడాదిలో ఎంతమంది శిశువులను హత్య చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అని ఆవేదనను వ్యక్తం చేసారు.  పసిబిల్లలకు ఏడాది వయస్సు వచ్చే వరకు తల్లిపాలు మాత్రమే  ఇవ్వాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: