బ్రేక్‌ఫాస్ట్‌లో వేడి వేడి `క్యారెట్ రైస్`
కావాల్సిన పదార్దాలు:
బియ్యం- అరకేజి
క్యారెట్లు- పావుకేజీ
జీడిపప్పులు- కొద్దిగా
నూనె- పావు కప్పు
పచ్చిమిర్చి- మూడు
ఆవాలు- అర టీ స్పూన్
ఉప్పు- తగినంత
నిమ్మరసం- టీ స్పూన్
కరివేపాకు- రెండు రెమ్మలు
పల్లిలు- మూడు టేబుల్ స్పూన్లు
పసుపు- చిటికెడు
సెనగపప్పు- అర టీ స్పూన్
గరంమసాల- టీ స్పూన్
తయారీ విధానం:
ముందుగా బియ్యం కడిగి అన్నం వండి పక్కనపెట్టాలి. తర్వాత క్యారెట్లను శుభ్రం చేసి తురుముకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేయ్యాలి. నూనె కాగాక ఆవాలు, సెనగపప్పు, జీడిపప్పు, పల్లీలు వేసి వేగిన తరువాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
ఇప్పుడు క్యారెట్ తురుము కూడా వేసి కాసేపు మగ్గనిచ్చి పసుపు, ఉప్పు వేసి రెండునిముషాల పాటు మూత పెట్టాలి. ఆ తర్వాత గరం మసాల, అన్నం వేసి బాగా కలిపి చివరిగా నిమ్మరసం వేసి స్టౌ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే వేడి వేడి క్యారెట్ రైస్ రెడీ..!