"అటుకులతో దోశ వేద్దామా ""
అమ్మ ఏంటి ప్రతి రోజు టిఫిన్... ఇడ్లీ లేకపోతే దోశ.... ఎదో ఒకరోజు పూరి పెడతావ్.. తినలేక చేస్తున్నాము.. ఏదన్నా వెరైటీ గా చేయమ్మా.. రోజు ఇవే తిని బోర్ కొట్టేసింది.. అని పిల్లలు మారం చేస్తున్నారా !!అయితే ఈరోజు ఒక కొత్త దోశ వేద్దామా.. అదేనండి అటుకులతో దోశ అన్నమాట... ఇపుడు కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా
కావలసిన పదార్థాలు::
1)పెరుగు అర కప్పు
2)బియ్యం కప్పు
3)అటుకులు అర కప్పు
4)మినప్పప్పు అర కప్పు
5) ఉప్పు రుచికి సరిపడా
6)మంచి నీళ్లు కప్పు
7) బేకింగ్ సోడా పావు టీ స్పూను
8)నూనె తగినంత
తయారు చేసే విధానం::
ఒక గిన్నెలో పెరుగు వేసి మంచి నీళ్ళు పోసి బాగా గిలకొట్టాలి.. మరో గిన్నెలో బియ్యం, అటుకులు మినపప్పు వేసి బాగా కడగాలి తరువాత వీటిలో మజ్జిగ మూడు పోసి నాలుగు గంటలు నాననివ్వాలి.
తర్వాత నాన్న పెట్టిన మజ్జిగను పక్కన ఉంచి, బియ్యం, పప్పు, అటుకులు మూడు కలిపి మిక్సీలో వేసి కాస్త మెత్తగా అయ్యాక, పక్కన పెట్టుకుని ఉంచుకున్న మజ్జిగ పోస్తూ అంబాగా మెత్తగా రుబ్బుకోవాలి..
అందులో అలాగే కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి నాలుగైదు గంటలు పులియా పెట్టాలి..ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు... పిండి అలా నానపెడితే మంచిది రుచి వస్తుంది.. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి దోశలు వేయాలి...
దోస పైన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము కూడా వేసుకుని, ఎర్రగా కాల్చుకుని తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్.. ఒక్కసారి ట్రై చేయండి... నచ్చితే అసలు వదిలి పెట్టరు..