ఈ చలికాలంలో వేడి వేడి వెజిటబుల్ సూప్.. అదుర్స్ కదా!
ముందే ఇది చలికాలం. ఈ కాలంలో ఎంత వేడి పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. అయితే అలా వేడి వేడిగా తినాల్సిన వాటిలో ఇది కూడా ఒకటి. అది ఏంటంటే.. వెజిటబుల్ సూప్.. వెజిటబుల్ సూప్ అనే కాదు.. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ సూప్ అయినా సరే ఈ చలికాలంలో తీసుకుంటే అదిరిపోతుంది. అయితే ప్రస్తుతం వెజిటబుల్ సూప్ ఎలా చెయ్యాలి అనేది తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు..
అల్లం - చిన్నముక్క,
వెల్లుల్లి - నాలుగు రెబ్బలు,
పచ్చిమిర్చి - ఒకటి,
కొత్తిమీర - కొద్దిగా,
బీన్స్ - నాలుగైదు,
క్యారెట్లు - రెండు,
క్యాప్సికం - ఒకటి,
పుట్టగొడుగులు - మూడు,
ఉల్లికాడలు - రెండు,
మిరియాలు - ఒక టీస్పూన్,
సోయా సాస్ - ఒక టేబుల్‌స్పూన్,
మొక్కజొన్న పిండి - నాలుగు టేబుల్‌స్పూన్లు,
ఉప్పు - రుచికి తగినంత,
నూనె - సరిపడా.
తయారీ విధానం...
కూరగాయలను శుభ్రంగా నీటితో కడగాలి. పాన్‌లో నూనె వేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేగించాలి. తర్వాత కట్ చేసిన బీన్స్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం, మిరియాలు, కొత్తిమీర వేసి మరి కాసేపు వేగనివ్వాలి. ఈ మిశ్రమంలో తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. సోయాసాస్ వేసి కొన్ని నీళ్లు పోసి మరికాసేపు మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో మొక్కజొన్న పిండి వేసి కలపాలి. సన్నగా తరిగిన ఉల్లి కాడలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చలికాలం ఈ వెజిటబ్లో సూప్ ఎంతో బాగుంటుంది.