అమ్మ: మొదటి మూడు నెలల్లో గర్భస్రావం అవ్వకూడదంటే... ఇలా చేయకపోతే కష్టమే?
జీవితంలో ఏ మహిళకు అయినా గర్భం ధరించడం ఓ వరం. మహిళగా పుట్టిన వారు ఎవరైనా అమ్మ అవ్వాలని కోరుకుంటారు. అది ఓ మధురాను భూతి. అయితే మారుతున్న జీవన పరిస్థితుల నేపథ్యంలో ఈ కాలం మహిళల్లో తరచూ గర్భసావ్రం (అబార్షన్) జరుగుతోంది. గతంలో మహిళలకు కడుపు వస్తే ఇంటి దగ్గరే ఉండేవారు. ఇప్పటి రోజుల్లో మరో పది హేను రోజుల్లో డెలివరీ అవుతుందనుకుంటున్న టైం వరకు కూడా ఉద్యోగాల్లోనో లేదా ఇతర పనుల్లోనో నిమగ్నం అవుతూనే ఉంటున్నారు. ఇక గర్భం ధరించిన స్త్రీలకు పిండం ఎదగాలంటే మొదటి మూడు నెలలు కీలకం.
ఈ మూడు నెలల్లో మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్లు అనేక సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వీటి ప్రకారం తొలి మూడు నెలల్లో గర్భిణీలు జున్నుకు దూరంగా ఉండాలి. ఇది విషాహారం దీని వల్ల గర్భవిచ్ఛిత్తి కూడా జరుగుతుంది. అలాగే మొదటి మూడు నెలల్లో గతుకుల రోడ్లపై ప్రయాణించ కూడదు. అలాగే ద్విచక్ర వాహనాలపై కూడా ప్రయాణం చేయకూడదు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోకూడదు. అలాగే కెఫిన్ అధికంగా ఉన్న పదార్థాలతో పాటు డ్రింక్స్ కూడా తీసుకోకూడదు.
నిల్వ ఉన్న మాంసాహారాలకు దూరంగా ఉండాలి. ఒత్తిడి హార్మోన్సు అయ్యే హార్మోన్స్ గర్భం ధరించిన మొదటి మూడు నెలల్లో శరీరంలో అనేక మార్పులకు చోటు చేసుకుంటుంది. ఒత్తిడి హోర్మోన్ల ప్రభావం వల్ల మీ గర్భాశయాన్ని సంకోచాలకు దారితీసి పిండం స్థానభ్రంశము చెందుటను ప్రారంభిస్తుంది. కాబట్టి, చాలా వరకూ మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.