ఆటిజం ప‌రిష్కారానికి కేరాఫ్‌.. ' పినాకిల్ బ్లూమ్స్ ' ‌.. ' శ్రీజారెడ్డి ' ‌ ..!

VUYYURU SUBHASH

పోరాడితే పోయేదేమీ లేదు.. ఆటిజం స‌మ‌స్య త‌ప్ప‌!! అన్న విధంగా ఒక్క మ‌హిళ‌.. ఒకే ఒక్క మ‌హిళ‌.. వైద్యుల‌కు కూడా అంద‌ని ఆటిజం స‌మ‌స్య ప‌రిష్కారంపై నిరంత‌రం పోరాడి.. అవిర‌ళ కృషి చేసి.. ఘ‌న విజ‌యం సాధించారు. ఆమే.. ప్ర‌ముఖ టెకీ.. కోటిరెడ్డి స‌రిప‌ల్లి స‌తీమ‌ణి శ్రీజారెడ్డి. బుద్ధి మాంద్యాన్నే ఆటిజం అంటారు. ఇది చిన్న‌వ‌య‌సులోనే చిన్నారుల‌కు అంక్ర‌మిస్తుంది. ఇందులో పిల్ల‌లు ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వారి బాధ మ‌న‌కు అర్థం అవుతోంది.. వారి స‌మ‌స్య వారికి అర్థం కాదు... ఆ పిల్ల‌ల‌ను చూసి వారి త‌ల్లిదండ్రులు ఎంత మ‌నోవేద‌న‌కు గుర‌వుతారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 

 

ఎందుకు వ‌స్తుంది? ఎలా వ‌స్తుంది?  ఎలా పోతుంది? అనే ప్ర‌శ్న‌ల‌కు నేటికీ స‌మాధానం లేదు. ఇది ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న స‌మ‌స్య‌. 1995 నాటికి ఉన్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ప్ర‌పంచ వ్యాప్తంగా 500 మంది చిన్నారుల్లో ఒక్క‌రు మాత్ర‌మే ఆటిజంతో బాధ‌ప‌డేవారు. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా అన్న‌ట్టుగా ఈ వ్యాధి తీవ్రత కూడా పెరిగిపోయింది. 2019 నాటికి ప్ర‌పంచ వ్యాప్తంగా 32 మంది చిన్నారుల్లో ఒక‌రికి చొప్పున ఆటిజం వేధిస్తోంది. ఇది పైకి క‌నిపించే స‌మ‌స్య‌కాదు.. అలాగ‌ని స‌ద‌రు ఆటిజంతో ఇబ్బంది ప‌డే వారికి కూడా తెలిసే స‌మ‌స్య కూడా కాదు! అంత చిత్ర‌విచిత్ర‌మైన ఈ ఆటిజం.. ప‌క్క‌న ఉండేవారికి మాత్ర‌మే తెలుస్తుంది. 

 

తాము ఏం చేస్తున్నామో.. త‌మ కుటుంబ స‌భ్యులు ఎవ‌రో కూడా గుర్తించే ప‌రిస్థితి ఆటిజంతో ఇబ్బంది ప‌డే చిన్నారుల్లో మ‌న‌కు క‌నిపి స్తుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. జీవం ఉన్న‌ప్ప‌టికీ.. చ‌ర్య‌-ప్ర‌తిచ‌ర్య లేని ప‌రిస్థితిలో స‌దరు ఆటిజం చిన్నారి ఇబ్బంది ప‌డ‌తారు.

 

ఈ క్ర‌మంలోనే ఆమె అనేక మంది వైద్యుల‌ను క‌లిశారు. అయితే, దీనికి నేరుగా వైద్యం లేద‌ని, ఒక‌వైపు వైద్య సేవ‌లు తీసుకుంటేనే మ‌రోవైపు ఫిజియోథెర‌పీ ద్వారా ప్ర‌య‌త్నం చేయాల‌ని తెలుసుకున్నారు. ఆ వెంట‌నే ఆమె ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేశారు. ఆటిజంలో ప్ర‌ధాన‌మైన సైక‌లాజిక‌ల్ కౌన్సెలింగ్‌, ఫిజియోథెర‌పీ, స్పీచ్ థెర‌పీ ఇలా అనేక రూపాల్లో సేవలు అందాల్సి ఉంది. త‌మ కుమారుడికి ఇవ‌న్నీ అందించారు. ఇక్క‌డే

 

ఈ క్ర‌మంలో తామే ఒక సంస్థ‌ను ఎందుకు ఏర్పాటు చేయ‌కూడ‌ద‌ని త‌ల‌పోశారు. ఇలా పురుడు పోసుకున్న‌దే పినాకిల్ బ్లూమ్స్‌. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని సుచిత్ర‌లో ఉన్న పినాకిల్ బూమ్స్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఆటిజంతో ఇబ్బంది ప‌డుతున్న చిన్నారుల పాలిట వ‌రంగా మారింది. ఇక్క‌డే అన్ని ర‌కాల వైద్యాల‌ను అందిస్తూ.. చిన్నారుల మాన‌సిక స్థితిని స‌రిచేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక‌, బోయిన‌ప‌ల్లి స‌హా వేర్వేరు ప్రాంతాల్లోనూ పినాకిల్ బ్లూమ్స్‌ను ఏర్పాటు చేశారు. మొత్తంగా 14 కేంద్రాల ద్వారా ఈ సేవ‌లు అందిస్తూ.. ఆటిజం చిన్నారుల పాలిట అభ‌య‌హ‌స్తం అందిస్తున్నారు.

 

 

Pinnacle Blooms Network is #1 Autism Therapy, Child Development Centres Network. Core purposed to be empowering 80+ crore kids, {{RelevantDataTitle}}