శ్రీజారెడ్డి: ఈ అమ్మ ప్రేమ కిరణాలు.. ఎందరో తల్లులకు ఆనంద బాష్పాలు..!

VUYYURU SUBHASH

జీవితం అన్నాక‌.. ల‌క్ష్యం.. గ‌మ్యం అంటూ.. అనేకం నిర్దేశించుకునేవారు చాలా మందే ఉంటారు. అయితే, ఈ ల‌క్ష్యాలు సాధార‌ణంగా వ్య‌క్తిగ‌త అంశాల‌కు, లేదా వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతాయి. వాటిని సాధించ‌డాన్నే ల‌క్ష్యంగా నిర్దేశించుకుంటారు. అయితే, ఎక్కడో ఒక‌రిద్ద‌రు మాత్రం త‌మ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం.. తామొక్క‌రే చూసుకోకుండా.. స‌మాజానికి కూడా స‌ద‌రు స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపుతారు. నిజానికి ఇలాంటి వారు చాలా త‌క్కువ‌గా ఉంటారు. గ‌తంలో బ్రెయిలీ అంధుడు కావ‌డంతో ఆయ‌న అనేక అవ‌మానాలు ఎదుర్కొన్నారు.

 

ఈ క్ర‌మంలో చ‌ద‌వ‌డం, రాయ‌డం అనేవి బ్రెయిలీకి ఒక స‌వాల్‌గా మారింది. అయితే, త‌న స‌మ‌స్య‌ను త‌న ‌తోనే ఆయ‌న ఫుల్ స్టాప్ పెట్టుకోలేదు. యావ‌త్ ప్ర‌పంచానికి కూడా మార్గ‌నిర్దేశనం చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అంధుల‌కు బ్రెయిలీ ఒక ఆశాజ్యోతిగా నిలిచి.. ఒక లిపిని సృష్టించారు. దానినే  బ్రెయిలీ లిపి అంటు న్నారు. దీనిద్వారా అంధులు మామూలుగా చ‌ద‌వ‌డంకాదు.. ఏకంగా సివిల్స్ వంటివి రాసి.. ఐఏఎస్‌లు అవుతున్నారు. ఇలా.. స‌మాజంలో త‌నకు ఎదురైన స‌మ‌స్య‌ను తాను మాత్ర‌మే ప‌రిష్క‌రించుకోవ‌డం కాకుండా.. మొత్తం స‌మాజంలో త‌న వంతుగా మార్పులు తీసుకు రావాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న మ‌హిళా ర‌త్నం..

 

ప్ర‌ముఖ టెకీ.. కోటిరెడ్డి స‌రిప‌ల్లి,

 

ఇలా అనేక వ్య‌య ప్ర‌యాస‌లకు ఓర్చుకుని సొంత‌గా ``పినాకిల్ బ్లూమ్స్‌``- అనే సంస్థ‌ను ఏర్పాటు చేసి.. త‌మ కుమారుడి మాదిరిగానే స‌మాజంలో ఆటిజంతో పాటు ఇత‌ర‌త్రా మాన‌సిక లోపంతో ఉన్న‌ బాధిత పిల్ల‌ల‌కు ఎన‌లేని సేవ అందిస్తున్నారు. పేద‌ల‌కు పూర్తి రాయితీతో పాటు స‌మాజంలో వెన‌క‌బ‌డిన వ‌ర్గాల పిల్ల‌ల‌కు భారీ రాయితీతో ఈ సేవ‌లు అందిస్తున్నారు. మహోత్కృష్ట ల‌క్ష్యం సాధించి.. త‌న ఇంటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌డ‌మే కాకుండా.. స‌మాజం స‌మ‌స్య‌ను కూడా ప‌రిష్క‌రిస్తున్న