అమ్మ: గర్భంతో ఉన్న మహిళ తినకూడని ఆహార పదార్ధాలు ఇవే ...!

Suma Kallamadi

గర్భవతులు గర్భంతో ఉన్నపుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. అయితే గర్భంతో ఉన్న మహిళ ఏదిపడితే అది తినకూడదు. ఇది తినాలన్న కడుపులో ఉన్న బిడ్డని గుర్తుపెట్టుకుని తినాలి. బాగా ఉడకని మాంసము ముఖ్యముగా పందిమాంసము తినకూడదు .. దీనివల "toxoplasmosis"అనే ఇంఫెక్షన్‌ వచ్చి బిడ్డ మెదడు పెరుగుదలను దెబ్బతీయును లేదా పుట్టే బిడ్డ గుడ్దిదిగా పుట్టును. కాల్చిన సముద్రపు చేపల రొట్టెలు తినకూడదు . దీనివల " Listeriosis " అనే ఇంఫెక్షన్‌ వచ్చే అవకాశము ఉన్నది.


దీనివల అబోర్షన్లు జరిగే అవకాశము ఉన్నది. అతి వేడి చేసే పదార్దాలు అంటే ఆవకాయ, మామిడికాయ, ఆవపెట్టిన కూరలు, నువ్వులు, బొప్పాయి వంటివి తొలి నెలల్లొఅంటే 1-3 నెలల గర్భిణీ తీసుకోకూడదు. పచ్చి గుడ్డు , సరిగా ఉడకని గుడ్లతో చేసిన పదార్ధములు తినకూడదు. పచ్చి గుడ్డులో " Solmonella " అనే బాక్టీరియా వల్ల టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశము ఎక్కువ. పాచ్యురైజేషన్‌ చేయని పాలతో తయారుచేసిన జున్ను వంటి పదార్ధములు తినకూడదు. పాచ్యురైజేషన్‌ చేయని పాలలో చాలా బాక్టీరియాలు ఉంటాయి.  దానివలన  గర్భస్రావం అయ్యే ప్రమాధము ఉండును. 


ఇంకా కాఫీ లోని కెఫిన్‌ మరియు కెఫినేటెడ్ డ్రింక్స్ చాలా ప్రమాదకరం.. రోజుకి 200 మి.గ్రా. కంటే ఎక్కువ కెఫిన్‌ తీసుకుంటే గర్భస్రావము జరిగే ప్రమాధము ఉంది . కెఫిన్‌ డైయూరిటిక్ గా పనిచేయును . వంటిలోని నీరును బయటికి పంపివేయడం వలన డీహైడ్రేషన్‌ వచ్చే అవకాశము వలన గర్భస్రావము జరిగే చాన్స్ ఎక్కువ.సారా (Alcohol) మరియు సారా సంబంధిత పదార్ధములు తీసుకోకూడదు.

 

 

బేబీ పెరుగుదలను, ఆరోగ్యాన్ని దెబ్బతీయును. కాయకూరలు బాగా కడిగి తినాలి. కడగని ఆకుకూరలు, కాయలు, పండ్లు పైన " Toxoplasmosis" కలుగజేసే బాక్టీరియా ఉండును . ఇది చాలా ప్రమాదకరము. విటమిన్‌ ' ఎ ' ఎక్కువగా ఉన్న మాంసాహారము అనగా లివర్ తో వండిన కూర తినకూడదు. దీనివలన బేబీ పుట్టికతో కూడుకున్న డిఫెక్ట్స్ తో పుట్టే అవకాశమున్నది. బీటా కెరటీన్‌ తో కూడుకొని ఉన్న విటమిన్‌ ' ఎ ' (కేరెట్స్ ) తినవచ్చును. కూరగాయలు కూడా బాగా ఉడికించుకుని తినాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: