అమ్మ : మీరు మీ పిల్లలకు తల్లి పాలు ఇస్తున్నారా... !!  అయితే ఈ ఆహార పదార్ధాలకు దూరంగా ఉండండి.. !!

Suma Kallamadi

బేబీ పుట్టిన తర్వాత మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే తాగుతుంది. అలాంటి సమయంలో మీరు తీసుకునే ఆహార పదార్థాల ఎఫెక్ట్ బేబీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన కొన్ని కొన్ని పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రంగులు కలిపిన ఆహార పదార్థాలు ఎక్కువగా తినకూడదు.  అంటే చికెన్ కబాబ్, గోబీ మంచూరియా ఇలాంటిి పదార్ధాలు. వీటిలో ఫుడ్ కలర్ ఎక్కువగా కలపడమే కాకుండా ఆయిల్స్ కూడా అస్సలు మంచివి  వాడరు. ఒకవేళ మీకు ఇలాంటిి పదార్ధాలు తినాలి అనిపిస్తే ఇంట్లోనే తయారు చేసుకుని తినండి.అలాగే చాక్లెట్స్ అనేవి అసలు తినకూడదు. అందులో ఉండేే కొన్ని కెమికల్స్ వలన పాలు తగ్గిపోవడానికి అవకాశం ఉంది.ఇంకా లేస్, బింగో, చిప్స్ ఇలాంటి పదార్థాలని  చాలా రోజులుు నిల్వ ఉండటానికి ఇందులో చాలా రకాల కెమికల్స్ కలుపుతారు. అవి మీ బేబీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. 

 

అందువలన మీరు మీ బేబీకి పాలు ఇస్తున్నట్లయితే ఇలాంటి ఫుడ్స్ కు కొంచెం దూరంగా ఉండండి.ఆవు పాలు తీసుకోవడం కూడా అంత మంచిది కాదు అని చెప్పవచ్చును. ఎందువలన అంటే ఆవు పాలలో చాలా ఎక్కువ ప్రొటీన్స్ ఉండటం వలన అవి మీ బేబీ డైజెస్ట్ చేసుకోలేరు. అందువలన మీ బేబీకి ఆరు నెలలు పూర్తి అయ్యేవరకు ఆవుపాలు తీసుకోకపోవడం మంచిది. సముద్ర చేపలను కూడా తినకూడదు. ఎందువలనంటే వీటిలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. దానివలన మీ బేబీ ఆరోగ్యానికి ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి సముద్ర చేపలను సాధ్యమైనంతవరకు తినకపోవడం మంచిది.మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూడా అస్సలు తీసుకోకూడదు. పాని పూరి, మసాలా చాట్ ఇలాంటివి తినడం వలన గ్యాస్టిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దాని వలన మీ బేబీకిి, మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది.టాబ్లెట్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 

 

డాక్టర్ని సంప్రదించకుండా అసలు ఏ విధమైన మాత్రలు వేసుకోకూడదు. మీరు వేసుకునే మాత్రలు రక్తంలో కలిసి పాలుగా మారి మీ పిల్లలకు వెళ్తాయి. వాటి వలన మోషన్స్, వాంతులు అవ్వే అవకాశం ఉంటుంది. బేబీకి పాలిచ్చే తల్లి ఆల్కహాల్ తీసుకోవడం వలన బేబీ ఎదుగుదలకు చాలా ప్రమాదం. తల్లి తీసుకునే ఆల్కహాల్లో 0.5% నుంచి 3.3% వరకు తల్లి పాలలో కలుస్తాయి. దీనివలన బేబీకి తెలివితేటలు తగ్గడం, రోగ నిరోధక శక్తి తగ్గడం వంటివి జరుగుతాయి.మీ బేబీకి పాలు ఇచ్చినన్ని రోజులు పైన తెలిపిన ఆహారపదార్థాలు ఏమీ తీసుకోకపోవడం మీకు ఇంకా మీ బేబీ ఆరోగ్యానికి చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: