అమ్మ :గర్భంతో ఉన్న ప్రతి మహిళ తీసుకోవలిసిన ద్రవ పదార్ధాలు.. !!

Suma Kallamadi

తల్లి కావడం అనేది ప్రతి మహిళ జీవితంలో ఒక గొప్ప అనుభూతి. అయితే మహిళలు గర్భం దాల్చినపుడు  అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం దగ్గరి నుండి తాగే నీళ్లు వరకు అన్ని ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి. ఎందుకంటే గర్భం తో ఉన్నప్పుడు మీరు మీ పోషణ మాత్రమే కాదు మీ కడుపులో పెరుగుతున్న శిశువు సంరక్షణ కూడా చూసుకోవాలని గుర్తుంచుకోవాలి. పౌష్టికాహారం మాత్రమే కాదు, ద్రవ పదార్దాలు కూడా మీ డైట్ లిస్ట్ లో చేర్చుకోవచ్చు.ప్రెగ్నెన్సీ లో డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది.

 

కాబట్టి గర్భధారణ సమయంలో ఎక్కువగా ద్రవ పదార్దాలు తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే మీరు తీసుకునే డ్రింక్స్ ఎంపిక హెల్తీ అయి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కార్బొనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్, లేదా కమర్షియల్ ఫ్రూట్ జ్యూస్ లను నివారించాలి. ఇలాంటివి కేవలం పొట్టను నింపుతాయి, శరీరానికి ఎటువంటి క్యాలరీలను అందివ్వవు . మేము ఇప్పుడు కొన్ని హెల్తీ డ్రింక్స్ గురించి చెప్పబోతున్నాం. అవేంటో ఇప్పుడు చూద్దాం..
గర్భిణీలు గ్రీన్ టీ త్రాగడం ఆరోగ్యానికి మంచిదే. ఇది ఒత్తిడి తగ్గించడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

 

 

అవొకాడో గర్భిణీలకు ఒక ఉత్తమ ఫ్రూట్. ఇది గర్భిణీలో బ్లడ్ ప్రెజర్ ను క్రమబద్దీకరిస్తుంది. స్ట్రెస్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి, పెరుగు, పాలు, తేనెతో అవొకాడో జోడించి తయారుచేసిన జ్యూస్ లేదా స్మూతీస్ ను తీసుకోవడం మంచిది.ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భిణీలకు వ్యాధినిరోధకతను పెంచడానికి సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఇంకా శరీరంలో వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలకు పాలు ఒక ఉత్తమ ద్రవ పదార్థం. ఎందుకంటే మహిళలకు అవసరం అయ్యే క్యాల్షియం అందివ్వడంలో పాలు సహాయపడుతాయి.

 

 

ఇది సెరోటెనిన్ ను అందిస్తుంది, దాంతో మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. కానీ, పాలలో ఏ ఇతర ఆర్టిఫిషయల్ ఫ్లేవర్ పౌడర్స్ ను జోడించకండి. రోజుకు రెండు సార్లు పాలను త్రాగడం గర్భిణీలకు చాలా అవసరం.గర్భిణీ స్త్రీలు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లైతే చెర్రీ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది. చెర్రీ జ్యూస్ త్రాగడం వల్ల ఒత్తిడి తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. దాంతో మంచి నిద్ర వస్తుంది.గర్భిణీ స్త్రీలు రెగ్యులర్ డ్రింక్స్ లో కొద్దిగా అల్లం ను జోడించడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చాలా వరకు ఎక్కువగా గర్భిణీ స్త్రీలకు అల్లం టీ త్రాగమని సలహాలిస్తుంటారు. ఇది మార్నింగ్ సిక్ నెస్ ను నివారిస్తుంది. అంతేకాకుండా దీన్ని ఒక ట్రెడిషినల్ మెడిసిన్ గా కూడా ఉపయోగిస్తుంటారు.గర్భిణీ స్త్రీలు చాలా వరకూ హెర్బల్ టీలు తీసుకోవడం ఆరోగ్యం. అంతేకాదు తల్లి బిడ్డకు ఇద్దరికీ సురక్షితం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: