అమ్మ : అమ్మ అనే పదం అద్భుతం.. !!ఆమెకి అంకింతం మన జీవితం... !!

Suma Kallamadi

 

అమ్మ అనే మాటలోనే ఉంది అనురాగం. మనం పది మందిలో ఒక్కరం  వంద మందిలో కూడా ఒక్కరమే, కోట్లలో  ఒక్కరం అయిన గాని మనల్ని  ప్రేమించే  ఒకే ఒక్క దేవత మన అమ్మ.  నీవు ఎంత వద్దనుకున్నా, ఎంత అసహ్యించుకున్నా గాని  నీ జీవితాంతం తోడు వచ్చేది తల్లి ప్రేమ ఒక్కటే.బిడ్డ తిట్టినా, కొట్టినా గాని  బిడ్డపై అమ్మ ప్రేమ మాత్రం తగ్గదు. మనం ఏదన్నా తప్పు చేస్తే అందరూ తిడతారు. కానీ ఒక్క అమ్మ మాత్రమే బిడ్డని దగ్గరకు తీసుకుని ఓదార్చి తప్పును సరిచేసి బిడ్డల్ని సరయిన మార్గంలో పెంచుంది..అమ్మ చేసే ప్రతి పని మన ఆనందం కోసమే.. మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది. బిడ్డ ఏడిస్తే తట్టుకోలేదు.

 

కానీ బిడ్డ  ఏడుస్తున్నప్పుడు  అమ్మ సంతోషించే క్షణం ఏదైనా ఉందంటే.. అది మనం పుట్టిన క్షణం మాత్రమే.మన ఏడుపుతో అమ్మ జీవం పోసుకుంటుంది.మనం పుట్టిన క్షణాన్ని ఒక గొప్ప అనుభూతిగా భావిస్తుంది.ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా మనకి జన్మ ఇస్తుంది. బిడ్డ ఎదిగే కొద్ది సంతోషిస్తుంది. ఎవరయినా బిడ్డని గూర్చి మాట్లాడైతే ఆమ్మో నా  బిడ్డకి ఇరుగు పొరుగువారి దిష్టి తగిలిందని అల్లాడిపోయి రాత్రికి రాత్రే దిష్టి తీసేస్తుంది.

 

మన మీద అంతా ప్రేమ అమ్మకి.. పదాలు తెలియని పెదవులకు అమృత వ్యాఖ్యం అమ్మ. ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ.. మహిళగా నీ త్యాగం ఎప్పటికీ మరవలేమమ్మా.మా కోసం నీ జీవితం మొత్తం త్యాగం చేసావు. తల్లిగా బిడ్డల కోసం నిత్యం శ్రమించవు. ఎల్లపుడు బిడ్డల క్షేమాన్ని, ఉన్నతిని కోరుకున్నావు. బిడ్డ ఎంత ఎదిగిన కానీ ఒక్క రూపాయి ఆశించని నీ ప్రేమ నిస్వార్ధమైనది అమ్మ. అలాంటి అమ్మకి ఏమి ఇచ్చిన తక్కువే ఏమి చేసిన తక్కువే. ప్రాణం పోయేవరకు గుండెల్లో పదిలింగా ఉంచుకుంటాము నీ ప్రేమని... 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: