అమ్మ : పుట్టే బిడ్డ ఆడపిల్లా లేక మగపిల్లాడా అనేది ఎవరిమీద ఆధారపడి ఉంటుందో తెలుసా.. !!!

Suma Kallamadi

తల్లి కావడం అనేది ఒక గొప్ప అనుభూతి.కడుపులో బిడ్డ పడినప్పటి నుండి స్త్రీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే అసలు బిడ్డ అనేది స్త్రీ కడుపులో ఎలా మార్పులు సంతరించుకుంటుంది అనేది తెలుసుకుందాం.. !!  స్త్రీ  అండం అనేది  పిండంగా మారాలంటే అండవాహికల్లోనే వీర్యకణముతో కలయిక జరగాలి. అలా కలయిక జరిగిన  అండం పిండంగా మారి శక్తిని పుంజుకుంటుంది.ఇక్కడ  ఇంకో విషయం తెలుసుకోవాలి పుట్టే బిడ్డ ఆడ పిల్లా  లేక మగపిల్లాడా అనే విషయం తెలుసుకోవాలని  చాలా మంది ఆత్రుతగా ఎదురుచూస్తారు. కొంతమంది అయితే ఆడపిల్ల పుట్టిందని మహిళల్ని వేధించిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి.

కానీ పుట్టే బిడ్డ విషయంలో అసలు మహిళ పాత్ర అనేది ఏమి ఉండదని తెలుసుకోవాలి.. ఎందుకంటే పుట్టే బిడ్డ ఆడపిల్ల లేక మగ పిల్లాడా అనేది తండ్రి క్రోమోసోముల మీద ఆధారపడి ఉంటుంది. ఆడవాళ్ళలో రెండు X X క్రోమోసోములు మాత్రమే ఉంటాయి. అదే మగవారిలో XY అనే రెండు క్రోమోసోములు ఉంటాయి. అండాన్ని చేరే శుక్రకణం X అయితే అమ్మాయి పుడుతుంది. అదే అండాన్ని చేరే శుక్రకణం Y అయితే మగపిల్లవాడు పుడతాడు అన్న మాట. ఏవిధముగా బిడ్డ యొక్క లింగం అనేది తయారవుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే  తల్లి, తండ్రి యొక్క  XX క్రోమోసోమ్స్ అయితే  పుట్టేది ఆడపిల్ల అని,తల్లి, తండ్రి యొక్క  XY క్రోమోసోమ్స్ అయితే మగపిల్లవాడు పుడతాడు అని అర్ధం. 


ఈ పిండము నిదానంగా గర్భాశయం వైపునకు బయలు దేరుతుంది. అండము వీర్యకణముతో కలయిక పొందిన తరువాత గర్భాశయానికి చేరడానికి మూడునుంచి నాలుగు రోజులు పడుతుంది. గర్భాశయంలోనే ఇది పెరిగి రకరకాలుగా మార్పులు చెందుతుంది. ఈ పిండము గర్బాశయానికి చేరేటప్పటికి గర్భాశయము క్రొత్త టిస్యూలతోను, క్రొత్తరక్తంతోనూ, సిద్ధంగా ఉండి పిండము ఎదుగుదలకు అనువైన వాతావరణాన్ని కలిగించుకుని  ఉంటుంది. గర్భాశయానికి చేరిన పిండము గర్భాశయపు గొడలకి గట్టిగా అంటుకుని ఉండిపోయి, అక్కడే శిశువుగా పెరిగి చివరికి నెలలు నిండిన తరువాత జననము జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: