ఆడవాళ్లు వర్షాకాలంలో అందాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు...!

Suma Kallamadi

ఆడవాళ్లు వర్షాకాలంలో చర్మం కోసం అదనపు జాగ్రత్తలను తీసుకోవాలి. ఇలాంటి సమయంలోనే మన శరీరంలోని రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ వర్షాకాలంలోనే అంటురోగాలు ఎక్కువగా వస్తాయి. ఈ సీజన్ మన ఆరోగ్యాన్ని ఏవిధంగా అయితే ప్రభావితం చేస్తుందో అలాగే, మన చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి సమయంలో, మీరు మీయొక్క చర్మంపై సరైన జాగ్రత్తలను తీసుకోకపోతే మొటిమలు, తామర, దురద వంటి మొదలైన అనేక ఇతర చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. మీరు ఇలాంటి సీజన్లో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం.. !! వర్షాకాలంలో, మీ చర్మాన్ని శుద్ధి చేయడం చాలా ముఖ్యం. మీరు మీ చర్మసౌందర్యాన్ని సంరక్షించడానికి  కఠినమైన ఉత్పత్తులను వినియోగించినట్లయితే, అది మీ సున్నితమైన చర్మం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వర్షాకాలంలో మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచటానికి మంచినీరుని తాగటం అనేది బాగా ఉపయోగపడుతుంది. 

 

 

మీరు ఒకే రోజులో 8 - 10 గ్లాసుల తాగునీటిని తీసుకోవటం వల్ల మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది, అలాగే ఇతర చర్మ సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఇది మీ శరీరంలో ఉన్న విష పదార్థాలను దూరంగా ఉంచి, మీ చర్మం తాజాగా కనిపించేలా చేయడానికి బాగా సహాయపడుతుంది. వర్షాకాలంలో మీరు అధికంగా మేకప్  ఉపయోగించవద్దు, ఎందుకంటే ఇలాంటి పరిస్థితులలోనే మీ చర్మం అనేక చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో చర్మాన్ని సంరక్షించే పౌడర్లను ఉపయోగించండి.మీ చర్మ సంరక్షణకోసం మార్కెట్లలో లభించే ఇతర సౌందర్య సాధనాలను వాడటం కన్నా ఇంటిలోనే తయారు చేసుకోగలిగే ఫేస్ ప్యాక్ లను ఉపయోగించడం చాలా ఉత్తమం.ఈ వర్షాకాలంలో తేనె, బొప్పాయి, పెరుగు, ముల్తానీమట్టి వంటి మొదలైన పదార్థాలతో తయారు చేసుకోగలిగే ఫేస్ ప్యాక్లను వాడటం చాలా మంచిది.

 

 


 ఈ వర్షాకాల సమయాల్లో మీ ముఖానికి బ్లీచింగ్ అప్లై చేయడాన్ని మానుకోండి. ఎందుకంటే, ఇది మీ ముఖాన్ని పొడిగా చేసి, మరింత కఠినంగా కనిపించేలా చేస్తాయి. మీ చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడే సబ్బులను ఉపయోగించడం మర్చిపోవద్దు.బాగా ముదురు రంగులను కలిగిన లిప్ స్టిక్  ఉపయోగించకుండా ఉండండి, దానికి బదులుగా, లిప్ బామ్లను ఉపయోగించండి. ఒకవేళ మీ పెదవులు పగిలి నట్లయితే కొబ్బరినూనెను తప్పక వాడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: