ఆడవాళ్ళకి ఉసిరితో ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా...?
ఉసిరికాయ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఉసిరికాయను రుచి చూసే ఉంటారు. తినడానికి పుల్లగా ఉండే ఉసిరికాయలో ఉప్పు, కారం వేసుకుని తింటే ఆ రుచే వేరు. ఈ ఉసిరికాయ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆడవాళ్ళకి భలే మేలుచేస్తుంది ఉసిరికాయ. ఉసిరికాయ జ్యూస్ లో విటమిన్ సి తో పాటు ఇతర ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం...!! ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల అది చర్మంలోని మృత కణాలను తొలగించి కొత్త కణాలను పెంచుతుంది. చర్మం కాంతివంతం చేయడానికి ఉసిరికాయ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. ఆమ్లా జ్యూస్ నేరుగా ముఖానికి అప్లై చేసినా, జ్యూస్ రూపంలో తీసుకున్నాగాని మంచిది ఉపయోగం..
ఉసిరికాయ జ్యూస్ లో కొద్దిగా తేనె కలిపి తీసుకోవడం వల్ల మీరు ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. అంతేకాకుండా ఈ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది వృద్ధాప్య కణాలతో పోరాడుతుంది. రోజూ ఆమ్లా జ్యూస్ తాగడం వల్ల అకాల వృద్ధాప్యం, మొటిమలు, చర్మంలో సన్నని గీతలు, డార్క్ ప్యాచ్ లు మరియు ముడతలు రాకుండా చేస్తుంది.ఉసిరికాయతో ఫేస్ ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చు. ఉసిరికాయ గుజ్జులో కొద్దిగా పసుపు వేసి ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవచ్చు. ఇది చర్మం యొక్క ఆరోగ్యన్ని కాపాడుతుంది.
అందంగా కనపడాలంటే రోజూ ఎంతో కొంత ఈ జ్యూస్ తాగాలి. దీన్ని తయారుచేయడం కూడా చాలా సులభం. ఉసిరికాయలో విత్తనాలను తీసేసి పేస్ట్ చేసుకుని అందులో వాటర్ వేసి వడగట్టుకోవాలి. అందులో కొద్దిగా తేనె కలిపి రోజూ తాగాలి. తేనె యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. దాంతో చర్మ నష్టాన్ని తగ్గిస్తుంది. అలాగే స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది, డ్రై స్కిన్ నివారిస్తుంది. ఉసిరికాయ జ్యూస్ తాగడం లేదా పేస్ట్ ను లేపనంగా రాయడం వల్ల మీ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. చర్మంలో నలుపు తగ్గుతుంది. మీరు చేయవలసిందల్లా మీ ముఖం మీద కొంచెం ఆమ్లా రసం పూయడం. రోజూ ఇలా చేయడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గుతుంది.అలాగే ఈ ఆమ్లా జ్యూస్ తాగడం వల్ల ఆడవాళ్లు సులువుగా బరువు కూడా తగ్గుతారు...