కంటి క్రింద ఏర్పడే నల్లటి మచ్చలను తొలగించే అరుదైన చిట్కాలు.... !
చాలా మంది ఆడవాళ్లను వేదించే సమస్యల్లో కళ్ళ కింద నల్లటి వలయాలు ఒకటి.చాలా మంది ఆడవాళ్లకు కంటి కింద నలుపు మచ్చలు రావడం అలాగే కళ్ళ కింద చర్మం ముడతలు పడడం వల్ల చూడడానికి అందవిహీనంగా కనిపిస్తాయి. అయితే ఏజింగ్ లక్షణాలు ముందుగా చర్మంపై అలాగే కళ్ళ కింద కనిపిస్తాయి.కంటి కింద ముడతలు కూడా ఏజింగ్ లక్షణం కిందకే వస్తాయి. ఈ సమస్యను తగ్గించుకునేందుకు కొన్ని నేచురల్ రెమెడీస్ గురించి తెలసుకుందాం..
ముందుగా నిద్రలేమి లేకుండా సరిపడా నిద్ర అనేది పోవాలి. అలాగే కళ్ళ మీద ఎక్కువ ఒత్తిడిని పెట్టకండి. కంటి కింద ముడతల సమస్యను అరికట్టడం ద్వారా చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. కొబ్బరినూనెలో విటమిన్ 'E' తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ లభ్యమవుతాయి. ఇవి కంటి కింద ముడతలను తగ్గించేందుకు తోడ్పడతాయి.కాస్తంత కొబ్బరి నూనెను తీసుకుని నిద్రపోయే ముందు ఈ నూనెతో కంటి కింద మసాజ్ చేయడం కంటి కింద ముడతలను అరికట్టవచ్చు.పెరుగులో లభించే ల్యాక్టిక్ యాసిడ్ అనేది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ పెరుగును, ఒక టేబుల్ స్పూన్ తేనెను అలాగే కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను తీసుకోవాలి. వీటిని బాగా కలిపి చక్కటి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. దీన్ని కంటి కింద ముడతలపై అప్లై చేయాలి. పదిహేను నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో దీనిని తొలగించాలి.
అలోవెరాలో విటమిన్ 'సి' మరియు విటమిన్ 'ఈ' కూడా లభిస్తాయి.ఇవి చర్మం పటుత్వంగా ఉండేందుకు బాగా తోడ్పడతాయి. అలాగే, చర్మం హైడ్రేటెడ్ గా ఉండేందుకు తోడ్పడతాయి.ఒక అలోవెరా ఆకును తెరచి అందులోంచి జెల్ ను సేకరించండి.ఈ జెల్ ను ముడతలపై అప్లై చేసి అయిదు నిమిషాల తరువాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోండి. బొప్పాయిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అందులోంచి గుజ్జును స్వీకరించాలి.ఈ గుజ్జును ముడతలపై అప్లై చేసి పదిహేను నిమిషాలపాటు అలాగే ఉంచాలి పదిహేను నిమిషాల తరువాత ప్లెయిన్ వాటర్ తో చర్మాన్ని శుభ్రపరచుకుని తడిని టవల్ తో తుడుచుకోవాలి. నిమ్మరసంలో లభించే లభించే విటమిన్ సి అనేది ఫ్రీ రాడికల్స్ ను అరికడుతుంది.కాస్తంత నిమ్మరసాన్ని ముడతలపై అప్లై చేయాలి.లేదా అర నిమ్మచెక్కను తీసుకుని కంటి కింద ముడతలపై అప్లై చేయండి. ఇది ఏజింగ్ వలన ఎదురయ్యే కంటి కింద ముడతలను తగ్గించేందుకు తోడ్పడుతుంది.